ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pinnelli: ఈవీఎం పగులగొట్టలేదు: పోలీసుల విచారణలో పిన్నెల్లి..

ABN, Publish Date - Jul 10 , 2024 | 11:24 AM

నెల్లూరు: పోలింగ్ రోజున పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం, పాలువాయి గేటు పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని, ఈవీఎం పగులగొట్టలేదని, అసలు నంబూరి శేషగిరిరావు ఎవరో తనకు తెలియదని, ఆరోజు తన వెంట గన్ మెన్ కూడా లేరని, పోలీసుల విచారణలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాధానాలివి.

Pinnelli Ramakrishna

నెల్లూరు: పోలింగ్ రోజున పల్నాడు జిల్లా, రెంటచింతa మండలం, పాలువాయి గేటు పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని, ఈవీఎం (EVM) పగులగొట్టలేదని, అసలు నంబూరి శేషగిరిరావు (Namburi Sheshagirirao) ఎవరో తనకు తెలియదని, ఆరోజు తన వెంట గన్ మెన్ కూడా లేరని, పోలీసుల విచారణలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఇచ్చిన సమాధానాలివి. నెల్లూరు జైల్లో మంగళవారం రెండో రోజు పిన్నెల్లి పోలీస్ కస్టడీ విచారణ కొనసాగింది.


పల్నాడు జిల్లా, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి పోలీస్ కస్టడీ విచారణ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో పిన్నెల్లిని పల్నాడు జిల్లా పోలీసులు మొదటి రోజు విచారించారు. విచారణకు ఆయన సరిగా సహకరించలేదని తెలుస్తోంది. పాలువాయి గేటు 202 పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేయడమే కాకుండా అడ్డుకున్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై దాడి చేసిన ఘటనపై పిన్నెల్లిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. మరుసటి రోజు పరామర్శ పేరుతో కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడడమే కాకుండా విధుల్లో ఉన్న సీఐ నారాయణ స్వామిపై రాయితో దాడి చేశారు. ఈ ఉదంతంపై మరో కేసు నమోదైంది. ఈ కేసులకు సంబంధించి నెల్లూరు జైల్లో ఉన్న రామకృష్ణా రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కోర్టు అనుమతితో పల్నాడు పోలీసులు నెల్లూరు జైలుకు వెళ్లి విచారణ చేపట్టారు.


సోమవారం ఉదయం 10 గంటలకు డీఎస్పీతోపాటు 11 మంది పోలీసులు నెల్లూరు జైలు వద్దకు చేరుకున్నారు. వారిని అధికారులు లోపలకు అనుమతించలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. సాయంత్రం 3 గంటలకు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో ఏడుగురిని జైల్లోకి అనుమతించారు. 3 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7 గంటల వరకు సాగింది. పిన్నెల్లిని 50 ప్రశ్నలు అడగ్గా 30 ప్రశ్నలకు పైగా ‘నేను వెళ్లలేదు.. వారెవరో నాకు తెలియదు..’ అనే సమాధానాలు చెప్పినట్లు సమాచారం.


తొలిరోజు విచారణ పూర్తి చేసిన పోలీసులు, రెండోరోజు మంగళవారం కూడా విచారించారు. పోలింగ్ అనంతరం కారంపూడిలో అల్లర్లు, నారాయణస్వామిపై దాడికి సంబంధించి పిన్నెల్లిని ప్రశ్నంచారు. ఆయన సహకరిస్తే అనేక ప్రశ్నలకు సమాధానాలు వస్తాయని పోలీసులు చూస్తున్నారు.


కాగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రెండు రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు అడిషనల్‌ న్యాయాధికారి శ్రీనివాస్‌ కల్యాణ్‌ తీర్పునిచ్చారు. మే 13న పోలింగ్‌ రోజు రెంటచింతల మండలం పాలువాయి గేటు 202 పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై దాడి, 14న కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్‌ జైలుకు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుల్లో పిన్నెల్లికి 2 రోజుల పాటు పోలీసు కస్టడీ విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. నెల్లూరు సెంట్రల్‌ జైలులోనే విచారణ జరపాలని, వీడియో తీయాలని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు

అమరావతి భవనాలపై సీఆర్డీఏ కీలక నిర్ణయం

రైతు భరోసా అమలుకు శ్రీకారం..

విద్యుత్ రంగంలో 3.0 విధానం: సీఎం

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఫైర్..

బాసరలో ముదురుతున్న బీజాక్షరాల వివాదం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 10 , 2024 | 11:57 AM

Advertising
Advertising
<