ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: మాజీ ప్రధాని మన్మోహన్ మృతి.. తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన తెలుగు ప్రముఖులు...

ABN, Publish Date - Dec 27 , 2024 | 08:15 AM

ఆంధ్రప్రదేశ్: ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, భారతదేశ 14వ ప్రధాన మంత్రి మహ్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో మృతిచెందిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు.

Former prime minister Manmohan Singh

అమరావతి: ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, భారతదేశ 14వ ప్రధాన మంత్రి మహ్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో మృతిచెందిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు. కాగా, చికిత్సపొందుతూ గురువారం రాత్రి సమయంలో ఆయన మృతిచెందారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఆయన అధికారిక నివాసం మోతిలాల్ నెహ్రు మార్గ్-3కి తరలించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో శనివారం నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని మృతితో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నిస్వార్థ సేవలు అందించిన ఓ మహనీయుడిని దేశం కోల్పోయిందంటూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన పార్థివదేహానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సైతం మాజీ ప్రధాని మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.


గవర్నర్ సంతాపం..

మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిని దేశం కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆర్థిక సంస్కరణలతో ప్రపంచవ్యాప్త గుర్తింపును ఆయన సొంతం చేసుకున్నారని గవర్నర్ కొనియాడారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


సీఎం చంద్రబాబు సంతాపం..

మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మేధావి, రాజనీతిజ్ఞుడైన మన్మోహన్ సింగ్ వినయం, జ్ఞానం, సమగ్రత కలిగిన గొప్ప వ్యక్తి అని సీఎం కొనియాడారు. 1991లో ఆర్థికమంత్రిగా చేసిన సంస్కరణల మొదలు ప్రధానమంత్రిగా పదేళ్లపాటు దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని, వారి కుటుంబానికి, ఆత్మీయులకు, అభిమానులకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

"దేశాన్ని ఆర్థికంగా కొత్తపుంతలు తొక్కించిన నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయన దివంగతులయ్యారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. దేశ ఆర్థిక వ్యవస్థకు విప్లవాత్మక సంస్కరణలతో ఆద్యం పోసిన వారిలో మన్మోహన్ సింగ్ ఒకరు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, యూజీసీ ఛైర్మన్‌గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వారి హయాంలో చేపట్టిన సంస్కరణల వల్లే మన ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కింది. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. మన్మోహన్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా"- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్


"డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలతో విప్లవాత్మక మార్పులు తెచ్చి గొప్ప నేతగా, సమర్థవంతమైన ప్రధానిగా దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. ఆయన సాధారణ జీవన విధానం, నిశ్శబ్ద నాయకత్వం, దేశాభివృద్ధి పట్ల చూపించిన అంకితభావం ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయం. ఆయన మృతి భారతదేశానికి తీరని లోటు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా"- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి


"మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణవార్త బాధాకరం. ఆయన సేవలు చిరస్మరణీయం. పీవీ నరసింహారావు హయాంలో ఆయన సేవలు దేశం ఎన్నటికీ మర్చిపోదు. మహోన్నత వ్యక్తిని కోల్పోయాం. మన్మోహన్ సింగ్ లేకపోవడం దేశానికి తీరని లోటు"- మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి


"నాటి ప్రధాని పీవీ నరసింహారావు క్యాబినెట్‪లో ఆర్థికమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశ జీడీపీ వృద్ధి చెందడంలో కీలకపాత్ర పోషించారు. దాదాపు దశాబ్ద కాలంపాటు ప్రధానిగా సుదీర్ఘ సేవలు అందించి తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి, ఆలోచనాపరుడు, నిర్వాహకుడు. ఆర్థిక వ్యూహాలు మారుస్తూ దేశాన్ని గ్లోబల్ మార్కెట్‌లోకి చేర్చడం, ఆర్థికశక్తిగా మార్చడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సత్పురుషుడు, నిజాయితీపరుడైన మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా"- మంత్రి కందుల దుర్గేష్


"ఆర్థిక సంస్కరణల పితామహుడుగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం బాధాకరం. ఆయన సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. దేశాన్ని అగ్రస్థాయి ఆర్థికశక్తిగా మార్చే దిశగా మన్మోహన్ సింగ్ నిత్యం అడుగులు వేశారు. దేశ ప్రజల ఆర్థిక సామర్థ్యాలను పెంపొందించేందుకు చేసిన కృషి అనిర్వచనీయం. ఆ మహనీయుని స్ఫూర్తి దేశ ప్రజలందరికీ ఆదర్శప్రాయం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా"- మంత్రి కొల్లు రవీంద్ర


వైఎస్ జగన్..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఏ బాధ్యత నిర్వహించినా తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.


ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

"మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం అత్యంత బాధాకరం. ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు, అవిశ్రాంత యోధుడు, మహోన్నత నాయకుడు, భారతదేశ ఆర్థికశిల్పి మన సింగ్ జీ. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రెండు పర్యాయాలు ప్రధానిగా, అంతకుముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అమూల్యం. మన్మోహర్ సారథ్యంలో భారత్ అత్యధిక వృద్ధి రేటు సాధించి, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇండియన్ ఎకానమీ సూపర్ పవర్‌గా గుర్తించబడింది"- ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

"మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణ వార్త తీవ్రంగా కలచివేసింది. నిష్కళంకమైన పాలన, అత్యున్నత మానవతావాది అయిన మన్మోహన్‌ సింగ్‌ ఆధునిక భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరు. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలుతోపాటు దేశ అభివృద్ధికి ఆయన తీసుకున్న అనేక చరిత్రాత్మక నిర్ణయాలను ప్రజలు సదా గుర్తుంచుకుంటారు"- సీఎం రేవంత్ రెడ్డి


"మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు"- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు


"దూరదృష్టి గల నాయకుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు మన్మోహన్‌ సింగ్‌ మరణం దేశానికి తీరని లోటు"- మంత్రి సీతక్క


"మన్మోహన్‌ సంస్కరణల రూపశిల్పి, దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన గొప్ప ఆర్థిక మేధావి"- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


ఈ వార్తలు కూడా చదవండి:

Gold and Silver Rates Today: షాకింగ్.. పరుగులు తీసిన బంగారం, వెండి రేట్లు

PDS Ration Scam: పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణంలో విస్తుబోయే విషయాలు

Updated Date - Dec 27 , 2024 | 10:19 AM