Gummanur Jayaram: మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్
ABN, Publish Date - Mar 05 , 2024 | 10:40 PM
ఈరోజు మంగళగిరిలో నిర్వహించిన బీసీ సదస్సులో మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram ) తెలుగుదేశం(TDP) పార్టీలో చేరారు. అయితే ఈ విషయంలో ఊహించిందే జరిగింది. జయరాంను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీచేస్తానని వైసీపీ అధిష్ఠానానికి తెలిపారు.
అమరావతి: ఈరోజు మంగళగిరిలో నిర్వహించిన బీసీ సదస్సులో మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram ) తెలుగుదేశం(TDP) పార్టీలో చేరారు. అయితే ఈ విషయంలో ఊహించిందే జరిగింది. జయరాంను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీచేస్తానని వైసీపీ అధిష్ఠానానికి ఆయన తెలిపారు. హై కమాండ్ మాత్రం ఎంపీగా పోటీచేయాలని షరతు విధించింది. ఈ విషయం జయరాంకు నచ్చకపోవడంతో వైసీపీకి ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. గత కొంత కాలంగా జయరాం సీఎం జగన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇదే సమయంలో పలు సర్వేల్లోనూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని తేలడంతో ఆయన జగన్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో ఉంటే తనకు భవిష్యత్తు ఉండదని భావించిన అతను వెంటనే టీడీపీలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
ఇందులో భాగంగానే నేడు ఎమ్మెల్యే, మంత్రి, పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. రాజీనామా సమయంలో తెలుగుదేశంలో చేరుతున్నానని ప్రకటించారు. ఆయన ప్రకటించినట్లుగానే నేడు మంగళగిరి జయహో బీసీ సభ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో జయరాం టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో, ఆయనను బర్తరఫ్ చేయాలని వైసీపీ ప్రభుత్వం సిఫారసు చేయడంతో గవర్నర్ నజీర్ బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.
Updated Date - Mar 05 , 2024 | 11:18 PM