ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ఆయుధాలు వెనక్కి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్.. కోర్టు ఏం చెప్పిందంటే..

ABN, Publish Date - Oct 01 , 2024 | 08:49 PM

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి తమ ఆయుధాలను పోలీసులు తీసుకున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. వాటిని తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

అమరావతి: తమ ఆయుధాలు వెనక్కి ఇచ్చేలా ఏపీ పోలీసులను ఆదేశించాలంటూ వైసీపీ నేతలు హైకోర్టులో వేసిన పిటిషన్లపై ఇవాళ(మంగళవారం) విచారణ జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి తమ ఆయుధాలను పోలీసులు తీసుకున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. వాటిని తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.


అయితే పిటిషనర్లు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో సున్నితమైన పరిస్థితులు ఉన్నాయని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది కృష్ణారెడ్డి తెలిపారు. వారు తమ నియోజకవర్గాల్లో ఆయుధాలు ఉపయోగిస్తే ఉద్రిక్త పరిస్థితి తలెత్తే ప్రమాదముందని ఆయన కోర్టుకు వివరించారు. అందువల్లనే పోలీసులు వారి వద్ద నుంచి ఆయుధాలు తీసుకున్నారని తెలిపారు. అలాగే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఆచితూచి అడుగు వేస్తున్నారని కృష్ణారెడ్డి వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కృష్ణారెడ్డి చెప్పారు. దీంతో కేసు విచారణను హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.

ఈ వార్తలు కూడా చదవండి:

AP News: కొత్త మద్యం పాలసీ ప్రక్రియ షురూ.. నోటిఫికేషన్ వచ్చేసింది

Bosta SatyaNarayana: లులు గ్రూప్ ప్రతినిధులు కలిస్తే ఇంత హడావిడా..

Updated Date - Oct 01 , 2024 | 08:50 PM