IMA Guntur: వరద బాధితులకు అండగా.. ఐఎంఏ గుంటూరు బ్రాంచ్..
ABN, Publish Date - Sep 07 , 2024 | 11:24 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. వారం రోజులపాటు కురిసిన వర్షాలు ప్రజలకు నీడ లేకుండా చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో బుడమేరు పొంగి విజయవాడ వాసులను ముంచెత్తింది. ఇళ్లలోకి పెద్దఎత్తున నీరు చేరి దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
గుంటూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. వారం రోజులపాటు కురిసిన వర్షాలు ప్రజలకు నీడ లేకుండా చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో బుడమేరు పొంగి విజయవాడ వాసులను ముంచెత్తింది. ఇళ్లలోకి పెద్దఎత్తున నీరు చేరి దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
బుడమేరుకు పడిన గండ్లు పూడుస్తూ మరోసారి వరద ముంచెత్తకుండా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరో పక్క బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అందుకు అనుగుణంగా వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు సైతం ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, కంపెనీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తమకు చేతనైనా సాయం చేస్తూ బాధితు కుటుంబాలను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.
ఐఎంఏ గుంటూరు సాయం..
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలకు సాయం చేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ ముందుకొచ్చింది. వరదల కారణంగా ఇళ్లల్లో పేరుకుపోయిన బురద తొలగించేందుకు అవసరమైన 50మెషీన్లను ఏపీ అగ్నిమాపకశాఖకు అందించింది. ఇప్పటికే బురద తొలగింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే యంత్రాల కొరతతో పనులు అనుకున్నంతమేర ముందుకు సాగడం లేదు. దీంతో అగ్నిమాపకశాఖకు తమవంతుగా 50యంత్రాలు అందించగా.. ఇప్పటికే రూ.25లక్షల సాయం సైతం అందించింది.
ఈ సందర్భంగా ఐఎంఏ ఏపీ అధ్యక్షుడు నంద కిషోర్ మాట్లాడుతూ.. "బుడమేరుకు ఊహించనంత వరద వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మావంతు సాయం అందించేందుకు ముందుకొచ్చాం. ఇంతకు ముందు రూ.25లక్షల ఆర్థికసాయం చేశాం. ఇప్పుడు బురద తొలగించేందుకు 50మెషీన్లు అందిస్తున్నాం. మెడికల్ క్యాంపులు సైతం నిర్వహిస్తున్నాం. వరద వల్ల ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. వరద బాధితులకు ఎలాంటి అనారోగ్యం అనిపించినా క్యాంపుల వద్దకు వచ్చిన ఉచిత వైద్యం పొందాలి" అని అన్నారు.
మరోవైపు ప్రభుత్వం అడిగిన వెంటనే తమ వంతు సాయం అందించేందుకు వైద్యులు ముందుకొచ్చారని ఐఎంఏ గుంటూరు సెక్రటరీ బూసిరెడ్డి నరేంద్ర చెప్పారు. చిన్నచిన్న సందుల్లో ఉన్న ఇళ్ల వద్దకు అగ్నిమాపక యంత్రాలు వెళ్లలేకపోతున్నాయని ఆయన తెలిపారు. దీంతో బురద తొలగింపు పనులు ఆలస్యం అవుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, అందుకే తమ వంతుగా 50మెషీన్లు సేకరించి విజయవాడకు పంపిస్తున్నట్లు నరేంద్ర వెల్లడించారు. వరద ప్రభావం నుంచి విజయవాడ వాసులు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు ఐఎంఏ గుంటూరు సెక్రటరీ నరేంద్ర ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Leopard: లాలాచెరువులో చిరుతపులి సంచారం.. అప్రమత్తమైన అధికారులు..
Tirumala: తిరుమలలో విషాదం.. గుండెపోటుతో మహిళ మృతి..
Nimmala Ramanaidu: కాసేపట్లో బుడమేరు వరద నుంచి బెజవాడ వాసులకు విముక్తి
Ganesh Chaturthi: గణనాధుడికి ఘనంగా పూజలు..
Updated Date - Sep 07 , 2024 | 11:26 AM