Nara Lokesh: ఏపీలో పెట్టుబడులపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ABN, Publish Date - Jul 17 , 2024 | 08:30 PM
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్(X)లో ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్నాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదాన్ని ఉద్దేశించి . నారా లోకేష్ (Nara Lokesh) ట్వీట్ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ట్విట్టర్(X)లో ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్నాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదాన్ని ఉద్దేశించి లోకేష్ ప్రస్తావించారు. కర్నాటకలో తెచ్చిన కొత్త చట్టంపై ఇన్వెస్టర్లు, బిజినెస్ పీపుల్, నాస్కాం వంటి ఆర్గనైజేషన్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా కర్నాటక చట్టంపై చర్చ మొదలైన తరుణంలో ఆ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
ALSO Read: YS Sharmila: ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అన్నట్లుగా సీఎం ఢిల్లీ టూర్‌లు
నాస్కాం ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ ఏపీలో పెట్టుబడులపై లోకేష్ ట్వీట్ చేశారు. ఇన్వెస్టర్ల ఆవేదన, అభ్యంతరాలు తాను అర్థం చేసుకున్నానని ఏపీలో ఎటువంటి ఆంక్షలు, ఇబ్బందులు ఉండవని, పెట్టుబడులు పెట్టొచ్చంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, డాటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి రంగాల్లో విశాఖలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం పలికారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు పెట్టదని....ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు. ఉత్తమ పాలసీలు, మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్‌తో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తామని లోకేష్ తెలిపారు. నిపుణులైన యువత, మానవ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని, పెట్టుబడులు పెట్టాలని నారా లోకేష్ పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దాదాపు రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆయుల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు మరిన్ని పరిశ్రమలు ఏపీలో పెట్టవచ్చని నారా లోకేష్ బంపరాఫర్ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ వియత్నాం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మంచి పేరున్న విన్‌ఫాస్ట్ కంపెనీ సీఈవో పామ్ సాన్ చౌ, ఆ సంస్థ ప్రతినిధులు కూడా ముందుకు వచ్చారు.
ఇవి కూడా చదవండి...
Lanka Dinakar: భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన
Nitin Gadkari: ఏపీ జాతీయ రహదారులు, హైవే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి సమీక్ష..
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 17 , 2024 | 08:37 PM