Share News

AP News: జగన్ దెబ్బకు హరిదాసుగా మారిన గ్రామ సర్పంచ్

ABN , Publish Date - Jan 15 , 2024 | 11:36 AM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు ఓ గ్రామ సర్పంచ్ హరిదాసుగా మారిపోయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. సంక్రాంతి రోజున వట్టిచెరుకూరు మండలం కాట్రపాడులో సర్పంచ్ శివ శంకర్ హరిదాసు వేషదారణలో బిక్షాటన చేస్తూ నిరసన చేపట్టారు.

AP News: జగన్ దెబ్బకు హరిదాసుగా మారిన గ్రామ సర్పంచ్

గుంటూరు, జనవరి 15: ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) దెబ్బకు ఓ గ్రామ సర్పంచ్ హరిదాసుగా మారిపోయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. సంక్రాంతి రోజున వట్టిచెరుకూరు మండలం కాట్రపాడులో సర్పంచ్ శివ శంకర్ హరిదాసు వేషదారణలో బిక్షాటన చేస్తూ నిరసన చేపట్టారు. పంచాయతీ నిధులను ప్రభుత్వం వాడుకుందని, గ్రామ పంచాయతీలో నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా మారారన్నారు. కేంద్రం నుంచి వచ్చే పంచాయతీ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. గ్రామ సర్పంచ్‌లు జగన్ రెడ్డి పాలనలో బిక్ష గాళ్లుగా మారారని కాట్రాటు సర్పంచ్ శివశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్్లిక్ చేయండి...

Updated Date - Jan 15 , 2024 | 11:59 AM