AP -Telangana CS-Meeting: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై స్పెషల్ ఫోకస్
ABN, Publish Date - Dec 02 , 2024 | 07:32 PM
విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలు దూకుడు పెంచాయి. ఈ రోజు ఏపీలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు శాంతికుమారి, నీరబ్ కుమార్ ప్రసాద్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరికొన్ని సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టారు.
అమరావతి: విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు శాంతికుమారి, నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టంలోని అంశాలపై ఏపీలో తొలిసారిగా సీఎస్‌లు భేటీ అయ్యారు. అధికారుల కమిటీ సమావేశానికి ప్రాధాన్యం సంతరించకుంది. ఏపీ - తెలంగాణా సీఎస్‌ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం జరిగింది. విభజన చట్టంలోని 9.10 షెడ్యూలు సంస్థల ఆస్తుల పంపకాలపై సీఎస్‌ల కమిటీ చర్చించారు. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పంపకంపై అధికారుల కమిటీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
లేబర్ సెస్‌పై చర్చ..
రూ. 861కోట్ల లేబర్ సెస్‌ను ఏపీ, తెలంగాణ మధ్య విభజనకు నిర్ణయించారు. ఏపీకి అదనంగా చెల్లించిన ఎక్సైజ్ టాక్స్ రూ.81 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్ ట్రాఫికింగ్ నిరోధం కోసం జాయింట్ కమిటీ ఇరురాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖలతో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రెండు, మూడు అంశాల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగ్రిమెంటుకు నిర్ణయించారు. మిగిలిన అంశాలపై మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావించారు. విభజన అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశం ముగిసింది.
పరిష్కారం కానీ విద్యుత్ బకాయిల పంచాయతీ..
విభజన అంశాలపై రెండు గంటల పాటు సీఎస్‌ల కమిటీ సమావేశం జరిగింది. విద్యుత్ బకాయిల అంశంపై పంచాయతీ ఎటూ తేలలేదు. మూడు అంశాలపై ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం తీసుకున్నారు. రూ. 861 కోట్ల మేర లేబర్ సెస్‌ను ఏపీ, తెలంగాణల మధ్య పంపకానికి అంగీకరించారు. పన్నులు పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై పంపకాలపై ఓ నిర్ణయానికి రావాలనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. 9,10 షెడ్యూలు సంస్థల ఆస్తులు, అప్పులు పంపకాల విషయంలోనూ పంచాయితీ తేలలేదు.
ఎక్సైజ్ శాఖ బకాయిలపై చర్యలు..
ఉద్యోగుల మార్పిడిపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీకి అధికంగా చెల్లించిన రూ .81 కోట్ల బకాయిల అంశం పరిష్కారించనున్నారు. వాటిని తిరిగి చెల్లించినట్లు తెలిపింది. డ్రగ్స్ రవాణాపై రెండు రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖలతో జాయింట్ కమిటీ వేయాలని రెండు రాష్ట్రాల సీఎస్ అధికారులు నిర్ణయించారు. మరో రెండు అంశాల పైనా ఏకాభిప్రాయం కుదిరింది , దీనిపై రెండు రాష్ట్రాలు ఒప్పందానికి రావాలనీ నిర్ణయం తీసుకున్నారు. మరోమారు విభజన అంశాలపై సమావేశం కావాలని ఏపీ తెలంగాణ సీఎస్‌లు నిర్ణయించారు.
Updated Date - Dec 02 , 2024 | 07:45 PM