ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kollu Ravindra: ఆయనకు మంత్రి పదవి పోయింది.. కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 11 , 2024 | 10:44 PM

సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ యువతని ప్రోత్సహిస్తుందని.. బీసీలంటే టీడీపీ అని తెలిపారు.

నెల్లూరు: సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ యువతని ప్రోత్సహిస్తుందని.. బీసీలంటే టీడీపీ అని తెలిపారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టాకనే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. దేశంలోనే మొదటిగా స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇచ్చిన ఘనత టీడీపీదేనని చెప్పారు. కేసులు పెడితే బీసీలందరూ ఇళ్లలో కూర్చొంటారని జగన్ అనుకున్నారన్నారు. ఎంతో మంది బీసీలను జగన్ ప్రభుత్వం హత్య చేసిందన్నారు.

చీరాలలో వివాహితను వివస్త్రని చేశారని మండిపడ్డారు. అమర్నాధ్ గౌడ్‌ని అత్యంత దారుణంగా హతమార్చారని చెప్పారు. జగన్ బీసీలను బానిసలుగా చేయాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ఏపీలో బీసీల మీద ఘోరాలు జరుగుతుంటే, ఒక్క వైసీపీ బీసీ నేత కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీడీపీ బీసీల కోసం రక్షణ చట్టం తీసుకురాబోతుందని తెలిపారు. అనిల్ కుమార్ మంత్రిగా ఉన్న సమయంలో పోలవరాన్ని త్వరగా పూర్తి చేస్తానన్నాడని.. మంత్రి పదవి‌ పోయిందని.. చివరకు ఆయన నరసరావుపేట వలస వెళ్లాడని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 11 , 2024 | 10:44 PM

Advertising
Advertising