NTR Foundation: ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు మన్నవ మోహన కృష్ణ భారీ విరాళం
ABN, Publish Date - Jun 03 , 2024 | 09:50 PM
ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు (NTR Foundation) నాట్స్ మాజీ అధ్యక్షుడు(USA), తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) రూ. 2 కోట్ల చెక్కును సోమవారం విరాళంగా అందజేశారు.
అమరావతి: ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు (NTR Foundation) నాట్స్ మాజీ అధ్యక్షుడు(USA), తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) రూ. 2 కోట్ల చెక్కును సోమవారం విరాళంగా అందజేశారు. ఈ చెక్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి (Nara Chandra Babu Naidu) ఉండవల్లి నివాసంలో అందజేశారు. మన్నవను చంద్రబాబు అభినందించారు.
ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంతో మంది పేద విద్యార్థులను చదివిస్తోంది, ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు ద్వారా వేలాదిమందికి రక్తదానం చేస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ సుజల పథకంతో ఎన్నో గ్రామాలకు తాగు నీరు అందిస్తుని తెలిపారు.
ఉచిత మెడికల్ క్యాంప్‌ల ద్వారా పేదవారికి అనేక సేవలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ.2 కోట్లను విరాళంగా అందించటం చాలా సంతోషంగా ఉందని మన్నవ మోహన కృష్ణ పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న తెలుగు వారు కూడా ఎన్టీఆర్ ఫౌండేషన్‌కి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ అధ్యక్షుడు వేమూరి రవి, ఎన్టీఆర్ ఫౌండేషన్(USA) బోర్డు చైర్మన్ గొట్టిపాటి శ్రీధర్ పాల్గొన్నారు.
Updated Date - Jun 03 , 2024 | 09:53 PM