ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Anagani: రౌడీయిజం చేసిన జోగి రమేశ్ ఇవాళ నీతులు చెబుతున్నారు..

ABN, Publish Date - Aug 13 , 2024 | 06:03 PM

గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రౌడీయిజం చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ ఇవాళ నీతులు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా తప్పుడు పనులు చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాక కులప్రస్తావన తెస్తున్నారంటూ అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చాకే ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారని మంత్రి చెప్పుకొచ్చారు.

అమరావతి: గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రౌడీయిజం చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ ఇవాళ నీతులు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా తప్పుడు పనులు చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాక కులప్రస్తావన తెస్తున్నారంటూ అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చాకే ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారని మంత్రి చెప్పుకొచ్చారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్, సర్వేయర్ రమేశ్ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఇవాళ(మంగళవారం) ఉదయం వారిద్దరినీ ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించింది. దీనిపై విచారణ జరుగుతోంది. అయితే అక్రమాలకు సంబంధించి మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


రాజీవ్ జీవితాన్ని జోగి రమేశ్ నాశనం చేశారు..

ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.." రాజీవ్, ఆయన బాబాయ్ ఇలా అంతా కలిసి అగ్రిగోల్డ్ భూములు కబ్జాలు చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు ఏం మాట్లాడారో జోగికి గుర్తు లేదా?. అమర్నాథ్ గౌడ్ అనే చిన్న కుర్రాడిని హత్య చేసినప్పుడు కులాలు కూడు పెడతాయా అన్న వ్యక్తి జోగి రమేశ్. ఇప్పుడు ఎందుకు కులాల గురించి మాట్లాడుతున్నారు. కుటుంబ లబ్ధి కోసం చేసిన భూ అక్రమాలు ఇప్పుడు రుజువవుతుంటే తమది బీసీ కులం అంటూ కుల ప్రస్తావన తెస్తున్నారు. టీడీపీ ఎప్పుడూ కులాల గురించి మాట్లాడదు. అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారని గుర్తించాకే చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఇందులో రాజకీయ జోక్యం ఎక్కడుంది?. మీరు రూ.5కోట్ల విలువైన ఆస్తిని కాజేసే ప్రయత్నం చేశారు. జోగి స్వయంగా తన కుమారుడి భవిష్యత్తు నాశనం చేశారు. తెలుగుదేశం క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా ప్రభుత్వంలో ఎక్కడా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవు" అని చెప్పారు.


రెవెన్యూ సదస్సులు వాయిదా..

రెవెన్యూ సదస్సులను సెప్టెంబర్ ఒకటికి వాయిదా వేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉద్యోగులు, అధికారుల బదిలీలు కారణంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అధికారులు బదిలీ జరిగిన ప్రాంతాలకు వెళ్లిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయని భావిస్తున్నట్లు అనగాని చెప్పారు. 22-A, అసైన్డ్, చుక్కల భూములు వ్యవహారంలో అవకతవకలు సరిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రకరకాలుగా రికార్డులు మారినట్టు గుర్తించామని, ఆశ్చర్యం కలిగేలా రికార్డులు మార్చేశారని మంత్రి ధ్వజమెత్తారు. గత పాలకులు చట్టాన్ని గాలికి వదిలేశారని ఆయన దుయ్యబట్టారు. రీసర్వే జరిగిన చోట ఎవ్వరూ ఆనందంగా లేరని చెప్పుకొచ్చారు. మంచి క్వాలిటీ, రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాలు త్వరలో జారీ చేస్తామని వెల్లడించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పైనా చర్చించాల్సి ఉందని మంత్రి అనగాని ప్రసాద్ చెప్పుకొచ్చారు.

Updated Date - Aug 13 , 2024 | 06:03 PM

Advertising
Advertising
<