ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lokesh: గాంధీజీ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..

ABN, Publish Date - Oct 02 , 2024 | 09:03 AM

స్వరాజ్యం సాధించిన బాపూజీ.. కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యమని, సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.

అమరావతి: మహాత్మా గాంధీ జయంతి 9Mahatma Gandhi Jayanti) సందర్భంగా విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ( Minister Nara Lokesh) బాపూజీకి ఘనంగా నివాళులర్పిస్తూ (Tribute) ఎక్స్ (X) వేదికగా వ్యాఖ్యలు చేశారు. సత్యం, అహింస ఆయుధాలుగా భారత దేశపు స్వేచ్ఛా స్వాతంత్య్ర సమరాన్ని ముందుండి నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. స్వరాజ్యం సాధించిన బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యం కావాలన్నారు. సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.


కాగా రెండు రోజుల క్రితం ‘క్లీన్ అండ్ గ్రీన్‌’లో భాగంగా మంగళగిరిలో పరిసరాల పరిశుభ్రతకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఈ పనులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తానని లోకేష్ తెలిపారు.

కార్మికులను నియమించి గడ్డి తొలగింపు పనులకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్నారు. సొంతంగా 5 గడ్డి తొలగింపు మిషన్ల కొనుగోలుతో పాటు ప్రతి నెలా కార్మికులకు జీతాలు చెల్లించనున్నారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో నియోజకవర్గంలో రోడ్లకు ఇరువైపులా గడ్డి, పిచ్చిమొక్కల తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయి. మంత్రి చూపిస్తున్న చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


కాగా వరద బాధితుల (Flood Victims) కోసం విరాళాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాధితులను ఆదుకునేందుకు మరికొంతమంది ప్రముఖులు ముందుకొచ్చారు. సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను (Minister Nara Lokesh) కలిసి ప్రముఖులు విరాళాలు అందజేశారు. విజయవాడకు చెందిన ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ (ఐసీఎమ్‌ఏ) ప్రతినిధులు రూ.50 లక్షల విరాళం అందజేశారు.

అనంతపురానికి చెందిన కేఎమ్ షకీల్ సఫీ నేతృత్వంలో ఏపీ వక్ఫ్ ఇన్ స్టిట్యూషన్స్, ముతవల్లీస్ అండ్ మేనేజింగ్ కమిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.7,86,000 విరాళంగా అందజేశారు. తెనాలి పిడపర్తిపాలెంకు చెందిన అరుణోదయ మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో రూ.1,21,000 విరాళం అందించారు. అలాగే మచిలీపట్నంకు చెందిన ఎమ్.ధనలక్ష్మి రూ.లక్ష విరాళం, అనంతపురానికి చెందిన గుండిగ నాగరాజు రూ.10 వేలు విరాళం ఇచ్చారు. కష్టాల్లో ఉన్న వారికి తమవంతు సాయం అందించిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.


కొద్దిరోజుల క్రితం గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.6,01,116 , అమలాపురానికి చెందిన బోనం వెంకట చలమయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ బోనం కనకయ్య రూ.5 లక్షలు, నంద్యాలకు చెందిన ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఎండీ ఎస్.దినేష్ రెడ్డి, కాలేజీ డీన్ బి.సూర్యప్రకాశ్ రెడ్డి రూ.4 లక్షలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో ప్రజలు, వివిధ సంస్థల నుంచి సేకరించిన విరాళం రూ.2,95,000, నవ్యాంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రతినిధి జయకుమార్ రూ.2,50,000, మదనపల్లెకు చెందిన గోల్డెన్ వాలీ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ ఎన్.వి రమణారెడ్డి, కట్టా దొరస్వామి నాయుడు రూ.2 లక్షలు, అనంతపురానికి చెందిన వి.సురేష్ నాయుడు లక్ష రూపాయలు, బీజేపీ మజ్దూర్ విభాగం నాయకుడు నాగేశ్వరరావు రూ.10వేలు అందజేశారు. కాగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమవంతు సాయం అందించిన వారికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..

అరసవిల్లిలో భక్తులకు కనువిందు చేసిన అద్భుత దృశ్యం

సూపర్ 6 అమలు చేస్తాం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 02 , 2024 | 09:18 AM