Nadendla Manohar : సంక్షేమం, అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం
ABN, Publish Date - Oct 28 , 2024 | 08:16 PM
దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీకి సంబంధించిన విషయంపై చర్చించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏడు లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. 29 నుంచి లబ్ధిదారులు బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. రూ. 900 కోట్లు ముందుగానే గ్యాస్ కంపెనీలకు చెల్లించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
గుంటూరు జిల్లా: సంక్షేమం, అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో తొలిసారి సమీక్షా సమావేశం నిర్వహించినట్లు వివరించారు. జిల్లాకు రావాల్సిన నిధులపై చర్చించామని చెప్పారు. దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీకి సంబంధించిన విషయంపై చర్చించినట్లు తెలిపారు. ఏడు లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. 29 నుంచి లబ్ధిదారులు బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. రూ. 900 కోట్లు ముందుగానే గ్యాస్ కంపెనీలకు చెల్లించనున్నామని తెలిపారు. రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
అధికారులు, రాజకీయ నాయకులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో కీలకమైన జిల్లా గుంటూరు అని చెప్పారు. సర్వతోముఖాభివృద్ధి చేసే విధంగా సమీక్షా చేశామని అన్నారు. ఏ ఏ అంశాలపై దృష్టి సారించాలనే వాటిపై సమీక్ష చేశామని చెప్పారు. అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కూడా చర్చించామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
కాలువల ఆధునికీకరణపై ఎమ్మెల్యేలతో సమీక్షా చేశామని. నిధుల సమీకరణపై త్వరలోనే శుభవార్త చెబుతామని అన్నారు. సూర్యలంక బీచ్ పర్యాటక కేంద్రమని. వీటిని అభివృద్ధి చేసిన తర్వాత మెయింటనెన్స్ కోసం ఛార్జీలు వసూలు చేయాలని ఆలోచన చేస్తున్నామని అన్నారు. సీ ప్లేన్‌ను వచ్చే నెల 9 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. నాలుగు బీచ్‌ల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవినీతికి పరాకాష్ట రుషికొండ భవనాలని ఆరోపించారు. వాటిని ఏవిధంగా ఉపయోగించాలన్న అంశంపై సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారని అన్నారు. శాఖల మధ్య సమన్వయం కోసం సీఎం చంద్రబాబు సబ్ కమిటీ వేశారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Bomb Threats: ఆగని బాంబు బెదిరింపులు.. మరో విమానానికి..
AP Govt: ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో కీలక నిర్ణయం .. నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు
Gold And Silver Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
Yanamala: ఇక జగన్ జీవితం పాతాళమే
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 28 , 2024 | 08:21 PM