ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati: డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు

ABN, Publish Date - Aug 24 , 2024 | 08:04 PM

వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నిర్వీర్యం చేసిందని ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. 2014-19మధ్య గత టీడీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి రూ.41వేల కోట్లతో టెండర్లు ఇచ్చామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని నాశనం చేసి కూర్చుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Minister Narayana

అమరావతి: వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నిర్వీర్యం చేసిందని ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. 2014-19మధ్య గత టీడీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి రూ.41వేల కోట్లతో టెండర్లు ఇచ్చామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని నాశనం చేసి కూర్చుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆయన పలు విషయాలు వెల్లడించారు.


అమరావతి పనుల కోసం తాజాగా రూ.5వేల కోట్లు ఖర్చు చేసినట్లు నారాయణ తెలిపారు. రూ.36కోట్లతో రాజధాని ప్రాంతంలో కంపచెట్లు తొలగింపు చేపట్టామని, ఇప్పటికే 50శాతం పనులు పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో నాలుగు నర్సరీలు ఏర్పాటు చేశామని, వాటిని పట్టించుకోకపోవడంతో చెట్లు భారీగా పెరిగినట్లు మంత్రి చెప్పారు. రాజధాని ప్రాంతంలో నాలుగు పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. శాఖమూరు సెంట్రల్ పార్కు 300ఎకరాల్లో, అనంతవరం రీజినల్ పార్క్ 35ఎకరాలు, మల్కాపురం పార్కు 25ఎకరాల్లో అభివృద్ధి చేస్తు్న్నట్లు పేర్కొన్నారు. రెండు వాటర్ లేక్‌లు సైతం డెవలప్ చేస్తున్నామన్నారు.


కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌కు రెండు వైపులా బఫర్ జోన్ వస్తుందని, అక్కడ ట్రీ ప్లాంటేషన్ కూడా చేస్తామని తెలిపారు. అమరావతిలో మంచి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పొంగూరు వెల్లడించారు. ఇప్పటివరకు చేసిన పనులతో టెండర్లు ఆపేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి పనులు డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. రాజధాని నిర్మాణం ఆగిపోయి ఏదేళ్లు గడిచిపోయిందని, శాఖమూరిలోని అంబేడ్కర్ స్మృతి వనం అంశంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అంబేడ్కర్ స్మృతి వనం కోసం గతంలో టెండర్లు పిలిచామని, కొంతవరకు పనులు జరిగాక వైసీపీ ప్రభుత్వం వాటిని ఆపేసిందని మంత్రి నారాయణ చెప్పారు.

Updated Date - Aug 26 , 2024 | 03:31 PM

Advertising
Advertising
<