ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ramanaidu: జగన్ పాలనలో సాగు నీటి ప్రాజెక్ట్‌లు నిర్వీర్యం

ABN, Publish Date - Jul 05 , 2024 | 06:06 PM

జగన్ పాలనలో నీటి ప్రాజెక్ట్‌లు అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్ల జగన్ పాలన‌లో 20 ఏళ్లు జలవనరుల శాఖ వెనక్కు వెళ్లిందని చెప్పారు.

Minister Nimmala Ramanaidu

అమరావతి: జగన్ పాలనలో నీటి ప్రాజెక్ట్‌లు అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్ల జగన్ పాలన‌లో 20 ఏళ్లు జలవనరుల శాఖ వెనక్కు వెళ్లిందని చెప్పారు. ఈ రోజు(శుక్రవారం) సీఈఎస్ఈలతో మంత్రి నిమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వర్షాకాలానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు జగన్ ప్రభుత్వం తీసుకోలేదని అన్నారు. డ్యామ్ ఆపరేషన్స్ సరిగా లేకపోవడం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లోలపై అంచనా వేయలేదని చెప్పారు ప్రాజెక్ట్‌ల ఎమర్జెన్సీ అంశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాజెక్ట్ షటర్లు, గేట్లకు గతంలో గ్రీస్ కూడా వేయలేదని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో ఎక్కడ సిల్ట్ తీయలేదని.. ఫలితంగా వేల ఎకరాల ఆయకట్టు మునిగి పోతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.


‘‘ఖరీఫ్ పంటకు ఎలాంటి అవాంతరాలు లేకుండా యాక్షన్ ప్లాన్ చేసి, అగ్రికల్చర్ శాఖతో సమన్వయం చేసుకుంటాం. జగన్ పాపాలు ఇంకా వెంటాడుతున్నాయి.. పట్టి సీమలో మెయింటెయిన్ చేయకపోవడంతో బోల్ట్‌లు వూడి పోయే పరిస్థితి ఉంది. కృష్ణా డెల్టా శాసన సభ్యులు మాకు తాగు నీరు విషయంలో విజ్ఞప్తి చేశారు. కృష్ణా డెల్టాకు నీరు రావాలంటే ఆగస్టు ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వారంలో అనుమతి వస్తుంది. పులిచింతలలో 30 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేసేవారం. పులిచింతలలో 1/2 టీఎంసీ కూడా నీరు లేకుండా చేశారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నష్టం ఎక్కువగా ఉందిజ విభజన కన్న జగన్ పాలన వల్ల మనకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ప్రాజెక్టులు ప్రాధాన్యత పరంగా త్వరగా పూర్తి చేయగల వాటిపై రివ్యూ చేశాం. జగన్ పాలన లో వ్యవస్థ నిర్వీర్యమై సాగునీటి ప్రాజెక్ట్‌లు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎన్డీ ఏ ప్రభుత్వం రావడంలో ఉద్యోగస్తుల భాగస్వామ్యం ఉంది’’ అని తెలిపారు.


పోలవరాన్ని జగన్ విధ్వంసం చేశారు..

‘‘పట్టిసీమలో 24 పంప్‌లు గ్యాప్ ఇచ్చి వదులుకోవాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కాలువల వద్ద గ్రావల్ వద్ద తవ్వుకు పోయారు. మొత్తం నిన్న 15 పంపులు ఓపెన్ చేస్తే 2 పైప్ లైన్లు లీకేజీ వచ్చింది. పైప్ లైన్లపై అవగాహన ఉన్న మెగా అధికారులను కూడా పంపాను. రేపటికి 21 పంపులు ఓపెన్ చేసి కృష్ణా డెల్టా పరిధిలో దాహార్తి తీరుస్తా. రూ. 1300 కోట్లు పట్టిసీమకు ఖర్చుపెడితే రూ.50 వేల కోట్లు ఆదాయాన్ని ఇచ్చే పంటను కాపాడగలుగుతాం. పోలవరం విషయంలో జగన్ విధ్వంసం ఎలా జరిగింది సీఎం వివరించారు. చింతలపూడి వల్ల నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరించే అవకాశం ఉంది. గతంలో కోర్ట్ చింతలపూడి విషయంలో 3 నెలలు సమయం ఇచ్చినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. వ్యవసాయాన్ని లాభాసాటిగా చేయడం ప్రభుత్వ లక్ష్యం. జగన్ విధ్వంసం తో సీడబ్ల్యూసీ అంతర్జాతీయ నిపుణులను తెప్పించింది. పోలవరాన్ని సీఎం, అధికారుల పరిశీలించారు. నెలలో దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా వస్తుంది. ప్రాజెక్టు సేఫ్టీకే ప్రాధాన్యం ఇవ్వాలి.. కొత్త డయా ఫ్రమ్ వాల్ అవసరం అయితే చర్యలు తీసుకుంటాం. డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిన్న జగన్ పట్టించుకోలేదు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్ట్‌లు నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది’’ అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 06:06 PM

Advertising
Advertising