Minister Nimmala Ramanaidu: జగన్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించింది
ABN, Publish Date - Nov 03 , 2024 | 03:36 PM
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిస్కరించడంలో ఘోరంగా విఫలం అయందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట పేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
పశ్చిమగోదావరి: గత టీడీపీ ప్రభుత్వంలో 90శాతం గృహాలను పూర్తిచేస్తే జగన్ హయాంలో మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తిచేయలేకపోయారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో ఎన్టీఆర్ టిడ్కో గృహల సముదాయ కాలనీలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు ఉచితంగా ప్రయాణించే వాహనాన్ని ప్రారంభించారు. స్వయంగా వాహనాన్ని మంత్రి రామానాయుడు నడిపారు. పేదలు,మహిళల గృహాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 5వేల కోట్లను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. గృహాలను బ్యాంకులో తాకట్టు పెట్టి పేదలు, మహిళలపై జగన్ ప్రభుత్వం ఐదారులక్షల రూపాయలు అప్పుల భారం మోపిందని మంత్రి రామానాయుడు ఆరోపించారు.
టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబం
కృష్ణాజిల్లా, (మచిలీపట్నం) : రాష్ట్ర మైన్స్ , ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో లక్ష రూపాయలు రుసుం చెల్లించి మంత్రి కొల్లు రవీంద్ర - నీలిమ దంపతులు సభ్యత్వం తీసుకున్నారు. కొల్లు రవీంద్రతోపాటు ఆయన తనయుడు కొల్లు పునీత్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు హసీమ్ బేగ్ తదితరులు టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. 1989 నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చానని వివరించారు. టీడీపీలో చాలా పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకు, తన కుటుంబానికి వచ్చిందని అన్నారు. ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా సభ్యత్వాలు, సంస్థాగత నిర్మాణం కలిగిన పార్టీ తెలుగుదేశం అని ఉద్ఘాటించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమం కోసం పోరాడే ఏకైక రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనేనని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
రైతు సమస్యలపై 26వ ఢిల్లీలో ధర్నా చేపడతాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
విజయవాడ: సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీడీపీ మాజీ ఎంపీ, రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్లు రైతు సంఘాల సమావేశం ఇవాళ(ఆదివారం) విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, రైతుల డిమాండ్ల సాధనపై నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈనెల4వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఏపీలోని అన్ని ప్రముఖ నగరాల్లో నిరసనలు చేపడుతున్నట్లు ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవని.. స్వామినాథన్ సిఫార్సుల అమలు కావడం లేదని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయడం లేదని, పారిశ్రామికవేత్తలకు వేల కోట్లు రుణ మాఫీ ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.
కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలనీ కోరారు. ఇప్పటి వరకు సహకార సంఘాలు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని తెలిపారు. దేశంలో ఉన్నన్ని సహకార పరపతి సంఘాలు, డైరీ, మత్స్యకార సంఘాలు కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలను మార్పులు చేసి లేబర్ కోడ్‌లను తీసి వేశారని మండిపడ్డారు. కార్మిక చట్టాలను కాపాడాలని కోరుతూ ఈనెల 26వ తేదీన ఢిల్లీలో నిరసన చేపడతామని వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Politics: చంద్రబాబు.. ప్రజా ముఖ్యమంత్రి
AP Politics: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో భారీ కుంభకోణం
For More AndhraPradesh News And Telugu News..
Updated Date - Nov 03 , 2024 | 05:28 PM