ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sandhya Rani : అరకు కాఫీపై మంత్రి కీలక ప్రకటన

ABN, Publish Date - Jun 25 , 2024 | 03:48 PM

అరకు కాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు పెట్టబోతున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Gummadi Sandhya Rani) తెలిపారు. జీసీసీ ద్వారా అరకు కాఫీ చైన్ షాపులు పెడతామని కీలక ప్రకటన చేశారు.

Gummadi Sandhya Rani

అమరావతి: అరకు కాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు పెట్టబోతున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Gummadi Sandhya Rani) తెలిపారు. జీసీసీ ద్వారా అరకు కాఫీ చైన్ షాపులు పెడతామని కీలక ప్రకటన చేశారు. అరకు కాఫీని గత టీడీపీ ప్రభుత్వం బ్రాండింగ్ చేసి.. ప్రమోట్ చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడూ అదే తరహాలో అరకు కాఫీని తమ ప్రభుత్వం ప్రమోట్ చేస్తుందన్నారు. అరకు కాఫీని దేశ విదేశాల్లో ప్రమోట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. నెలకోసారి గిరిజన హాస్టళ్లల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ బిల్లులు పెట్టడం వల్ల పనులు చాలా వరకు జరగలేదన్నారు.


554 ట్రైబెల్ స్కూళ్లల్లో ఏఎన్ఎంలను డెప్యూటేషన్ మీద నియమిస్తున్నామని ప్రకటించారు. ఫీడర్ అంబులెన్స్, తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ వంటి సేవలను పునరుద్ధరిస్తున్నామని అన్నారు. హాస్టళ్లల్లో స్టడీ అవర్స్ తిరిగి ప్రారంభిస్తామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యే పోస్టుల్లో 2 వేలకు పైగా పోస్టులు గిరిజన స్కూళ్లల్లోనే ఉన్నాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వం రేషన్ డిపోలను రద్దు చేసిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలను తిరిగి ప్రారంభించే అంశంపై కసరత్తు చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. జీసీసీ ద్వారా నిర్వహించే సంస్థలను.. ఉత్పత్తులను మరింత ప్రొత్సహిస్తామన్నారు.


ఇకపై గిరిజన విద్యార్థుల మరణాలు ఉండకూడదని అధికారులను ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. పౌష్టికాహారం అందక గిరిజన పిల్లలు చనిపోకూడదని ఆదేశించారు. గిరిజన బాలికల హాస్టళ్లల్లో మహిళ వార్డెన్లనే నియమిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన హాస్టళ్లల్లో ఫిర్యాదు బాక్సులు పెడతామన్నారు. గంజాయి వల్ల ఎక్కువగా పిల్లలు, ఆడపిల్లలే బాధితులుగా ఉన్నారని చెప్పారు. గంజాయి మత్తులో ఏం చేస్తున్నామో తెలియని విధంగా దారుణాలు చేస్తున్నారని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి కట్టడికి చెక్ పోస్టులు పెట్టాలని ఆదేశించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో తాగు నీటి సౌకర్యం కల్పించాలని ఐటీడీఏలకు ఆదేశాలిచ్చామన్నారు. మైదాన ప్రాంతాల్లోని గిరిజనులకు ఇళ్ల నిర్మాణం చేపడతామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు.

Updated Date - Jun 25 , 2024 | 04:37 PM

Advertising
Advertising