Minister Savita: నాణ్యతలేని ఆహారం అందిస్తే చర్యలు తప్పవు.. మంత్రి సవిత వార్నింగ్
ABN, Publish Date - Jun 21 , 2024 | 10:18 PM
నాణ్యతలేని ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నారని.. అలా చేస్తే చర్యలు తీసుకుంటానని బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎస్. సవిత (Minister Savita) హెచ్చరించారు. విజయవాడ బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ని ఈరోజు(శుక్రవారం) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అమరావతి: నాణ్యతలేని ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నారని.. అలా చేస్తే చర్యలు తీసుకుంటానని బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎస్. సవిత (Minister Savita) హెచ్చరించారు. విజయవాడ బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ని ఈరోజు(శుక్రవారం) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ..హాస్టల్లోని సదుపాయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆకస్మికంగా వచ్చినట్లు తెలిపారు. హాస్టల్లో సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పనలో నిర్వాహకులు పూర్తిగా అశ్రద్ధ వహించారు. వసతులపై పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
వంట ఒకచోట, భోజనం మరో చోట ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట సరుకులు, కూరగాయలు నాసిరకంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారం నాణ్యత సరిగా లేకపోవడం, డైనింగ్ హాల్లో సదుపాయాల లేమీపై సిబ్బందికి నిలదీశారు.రోజు ఒకేరకమైన మెనూ ఏర్పాటుపై విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. మళ్లీ విద్యార్థుల నుంచి ఫిర్యాదు వాస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. ఏ క్షణం. ఎలాంటి సహాయం కావాలన్నా ఫోన్ చేయొచ్చని మంత్రి ఎస్. సవిత పర్సనల్ నెంబర్ ఇచ్చారు.
Updated Date - Jun 21 , 2024 | 10:18 PM