ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాలు విని టీడీపీ నేతలు పారిపోయారు: మంత్రి వేణుగోపాల్

ABN, Publish Date - Feb 05 , 2024 | 03:16 PM

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్(AP Governor Abdul Nazeer) ప్రసంగంలో విద్య, వైద్యం అంశాల గురించి ప్రస్తావించగానే టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోయారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Chellaboina venugopal krishna) అన్నారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్(AP Governor Abdul Nazeer) ప్రసంగంలో విద్య, వైద్యం అంశాల గురించి ప్రస్తావించగానే టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోయారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Chellaboina venugopal krishna) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... గతంలో రాజకీయ నాయకులమీద నమ్మకం ఉండేది కాదని... ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై నమ్మకం వచ్చిందని తెలిపారు.

అన్నివర్గాల సంక్షేమానికి అనుగుణంగా వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచిచేస్తేనే తనకు ఓటు వేయాలని జగన్ అన్నారంటే.. ప్రజలపై ఆయనకు ఎంత చిత్తశుద్ది ఉందో తెలుస్తుందన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పేదరికం తగ్గిందని చెప్పారు. కొంత మంది నేతలు ధనదాహానికి అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. పేదవారికి మంచి చేసే వారిని ఓడిస్తానని ఆ నేతలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కనబడదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 05 , 2024 | 03:40 PM

Advertising
Advertising