MLA Aravinda Babu: కోటప్పకొండ గిరి ప్రదక్షిణ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం

ABN, Publish Date - Jul 16 , 2024 | 07:21 PM

కోటప్పకొండ గిరి ప్రదర్శనకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు (MLA Aravinda Babu) తెలిపారు. నరసరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

MLA Aravinda Babu:  కోటప్పకొండ గిరి ప్రదక్షిణ కోసం అన్ని  ఏర్పాట్లు సిద్ధం
MLA Chadalavada Aravindababu

పల్నాడు జిల్లా: కోటప్పకొండ గిరి ప్రదర్శనకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు (MLA Aravinda Babu) తెలిపారు. నరసరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోటప్పకొండలో రేపు(బుధవారం) జరగబోయే గిరి ప్రదక్షిణ ఏర్పాట్లుపై చర్చించారు. ఈ సందర్భంగా అరవింద బాబు మాట్లాడుతూ..... రేపు తొలి ఏకాదశికి కోటప్పకొండ‌లో అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. తొలి ఏకాదశికి అందరూ శానిటేషన్ అధికారులు పాల్గొంటారని అన్నారు.


కోటప్పకొండకి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ముందుగానే తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. పల్నాడు జిల్లాలో ఆరు సెగ్మెంట్‌లలో డయేరియా, మలేరియా కేసులు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. డయేరియా, మలేరియా రాకుండా నరసరావుపేట డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని అన్నారు. నరసరావుపేట పరిశుభ్రతే ధ్యేయంగా అధికారులు పని చేయాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సూచించారు.

Updated Date - Jul 16 , 2024 | 07:21 PM

Advertising
Advertising
<