ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Kanna: అన్న క్యాంటీన్ పనులను పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ

ABN, Publish Date - Aug 01 , 2024 | 11:36 AM

పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్న క్యాంటిన్‌లలో ఐదు రుపాయలకే భోజనం ఏర్పాటు చేశారన్నారు.

పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ పనులను (Anna Canteen works) ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ (MLA Kanna Lakshminarayana) గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే (CM Chandrababu Naidu) అన్నారు. తెలుగుదేశం (TDP) హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్న క్యాంటిన్‌లలో ఐదు రుపాయలకే భోజనం ఏర్పాటు చేశారన్నారు. మూడు పూట్లా పేదలకు ఆహారం దొరికే విధంగా రాష్ట్రంలో అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. సైకో జగన్ రెడ్డి పాలనలో అన్న క్యాంటిన్లు రద్దు చేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో అన్న క్యాంటిన్లు రద్దు చేసినా.. టీడీపీ నాయకులు (TDP Leaders) ఉచితంగా అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేశారని.. సత్తెనపల్లిలో టీడీపీ నేత మల్లి 565 రోజులు ఉచితంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు.


శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెండు ఏర్పాటు..

పేదల ఆకలిని తీర్చేందుకు అన్న క్యాంటీన్‌లు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు వాటికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 15న వాటిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2014లో సీఎం నారా చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేశారు. 5 రూపాయలకే టిఫిన్‌, భోజనం అందించి పేదల ఆకలిని తీర్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్‌లను నిర్వీర్యం చేసింది. నిరుపేదల నోటికాడ కూడును లాగేసింది. అన్నక్యాంటీన్‌ భవనాలను వైసీపీ నేతలు తమ సొంత వ్యాపారాలకు వినియోగించుకున్నారు. వాటిని లీజు పద్ధతిలో తీసుకుని తమ జేబులు నింపేసుకున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్‌లను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 100, జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ఏడురోడ్ల కూడలి, పాతబస్టాండ్‌ వద్ద అన్న క్యాంటీన్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. ఆ భవనాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా అన్న క్యాంటీన్‌లను ప్రారంభించి నిరుపేదలకు చేరువచేయనున్నారు.


అన్న క్యాంటీన్లకు పూర్వవైభవం..

రాష్ట్రంలో అన్న క్యాంటీన్లకు పూర్వవైభవం రానుంది. పేదలకు చౌకగా భోజనం అందించే వీటిని పునఃప్రారంభించాలని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ వైపుగా చకచకగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోడలకు పట్టిన బూజు దులిపి, రంగులేసి, ఫర్నీచర్‌ ఏర్పాటు చేసి, సౌకర్యాలను మెరుగు పరిచే ప్రక్రియ కొద్ది రోజులుగా సాగుతోంది. పునరుద్ధరణ చర్యలు దాదాపు కొలిక్కి వచ్చాయి. తొలిదశలో విజయనగరం జిల్లాలో మూడు క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు.


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభం కానున్నాయి. అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ బృహత్తర పథకాన్ని తీసుకువచ్చింది. రూ.5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా రూ.5కే అందించేవారు. వీటిని కార్మికులు, కూలీలు, విద్యార్థులు, యాచకులు ఆశ్రయించేవారు. ఎంతో ఆదరణ పొందిన అన్న క్యాంటీన్లను 2019లో వైసీపీ అధికారం చేపట్టాక మూసేశారు. అప్పటి నుంచి ఆ భవనాలు వృథాగా పడి ఉన్నాయి. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత చేసిన తొలి ఐదు సంతకాల్లో అన్నక్యాంటీన్ల ప్రారంభానికి సంబంధించినది ఒకటి. అప్పటి నుంచి అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు చర్యలు మొదలయ్యాయి. ఆగస్టు-15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో తొలి దశలో విజయనగరం నగరపాలక సంస్థలో రెండు, బొబ్బిలిలో మరొకటి ప్రారంభించాలని నిర్ణయించారు. రెండో దశలో మరిన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కాగా అన్న క్యాంటీన్లను 2019లో వైసీపీ ప్రభుత్వం మూసేసినా టీడీపీ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన సొంత డబ్బులతో బొబ్బిలి అన్న క్యాంటీన్‌ను గత రెండేళ్లుగా నడిపిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో ఇక నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ అన్న క్యాంటీన్‌ నడవనుంది.


చురుగ్గా ఏర్పాట్లు

విజయనగరం రింగురోడ్డు వద్ద నెల 15 నుంచి ప్రారంభించనున్న అన్న క్యాంటీన్లను నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎంఎం నాయుడు బుధవారం పరిశీలించారు. డీఈలు, ఏఈలతో కలిసి పరిశీలించి పునరుద్ధరణ పనులు చేస్తున్న వారికి పలు సూచనలు ఇచ్చారు. అన్ని వసతులతో సౌకర్యవంతమైన అన్న క్యాంటీన్లను సిద్ధం చేస్తున్నట్టు విలేకరులకు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంతంలో ఒకటి, నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలో మరొకటి తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Live..: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

పారిశ్రామిక రంగంపై సీఎం కీలక నిర్ణయం..

సీఎంకు తలపోటుగా ఆ నియోజకవర్గం..!

యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 01 , 2024 | 11:46 AM

Advertising
Advertising
<