ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: చిత్తుచిత్తుగా ఎందుకు ఓడిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోండి: ఎమ్మెల్సీ అనురాధ

ABN, Publish Date - Jun 13 , 2024 | 03:40 PM

ఐదేళ్లపాటు వైసీపీ నేతలు(YSRCP leaders) చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (MLA Panchumurthi Anuradha) అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చిత్తుచిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవుపలికారు.

MLA Panchumarthi Anuradha

అమరావతి: ఐదేళ్లపాటు వైసీపీ నేతలు(YSRCP leaders) చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(MLA Panchumarthi Anuradha) అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చిత్తుచిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవుపలికారు. అలా చేయకుండా ఓడిపోయిన మరుసటి రోజు నుంచే శవ రాజకీయాలు మొదలుపెట్టారంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వైసీపీ అంటేనే శవ రాజకీయాల పార్టీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం పదవి కోసం తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించింది, 2019లో బాబాయి శవాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసింది జగన్ రెడ్డి కాదా? అని ఆమె ప్రశ్నించారు.


దాడులు, హత్యలు అంటే ఇవి జగన్..!

ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. "వైసీపీ ప్రభుత్వంలో పల్నాడులో తోట చంద్రయ్య గొంతు కోసి చంపారు. కంచర్ల జల్లయ్య యాదవ్‌ను హత్య చేశారు. దాచేపల్లిలో కాపు సామాజికవర్గానికి చెందిన పురంశెట్టి అంకుల్‌ని కిరాతకంగా హతమార్చారు. రేపల్లెలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి తగలపెట్టారు. జడ్ ప్లస్ కేటగిరి ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేశ్ దాడి చేశారు. మా పార్టీ కార్యాలయంపై దాడి చేసి సిబ్బందిని విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారు. దళిత డ్రైవర్‌ని వైసీపీ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేశారు. కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్‌ను వేధించి మరీ చంపారు. ఇసుక మాఫియాని ప్రశ్నించిన చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారు. ఎన్నికల రోజు తాడిపత్రి, చంద్రగిరి, మాచర్లలో దాడులు చేశారు" అని ఆమె చెప్పుకొచ్చారు.


దాడులు, హత్యలు అంటే ఇవనీ.. అలాంటిది రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటంపై ఆమె మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండ్రోజులే అయ్యిందని, తమ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తే "ఖబడ్దార్" అంటూ హెచ్చరించారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్సీ అనురాధ హితబోధ చేశారు.

ఇది కూడా చదవండి:

Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఛాన్స్‌లర్ కె.సి.రెడ్డిని అడ్డుకున్న ఉద్యోగులు

Updated Date - Jun 13 , 2024 | 03:40 PM

Advertising
Advertising