ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: రెవెన్యూ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు.. ఎందుకంటే..

ABN, Publish Date - Nov 08 , 2024 | 07:05 PM

రెవెన్యూ శాఖలో వసూళ్ల పర్వానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కింది నుంచి పైదాకా చేతులు చాపే వ్యవహారం నడుస్తోంది. ఏ చిన్నపనికైనా బేరసారాలు మాట్లాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పశ్చిమ గోదావరి: జిల్లాలోని భీమవరం కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలోని ఉద్యోగులపై ఇవాళ(శుక్రవారం) సస్పెన్షన్ వేటు పడింది. రెవెన్యూ సెక్షన్‌లోని ముగ్గురు ఉద్యోగులు సస్పెన్షన్ వేటు పడింది. మరో ఇద్దరు ఉద్యోగులను కలెక్టర్ నాగరాణి బదిలీ చేశారు. రెవెన్యూ విభాగంలోని ఉద్యోగులపై వివిధ రకాల ఆరోపణలు వెల్లువెత్తడంతో కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు.


విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఎస్.కె షకీల్, జూనియర్ అసిస్టెంట్లు కె.జీవన్ కుమార్, దివ్య స్మైలీలపై సస్పెన్షన్ వేటు పడింది. జూనియర్ అసిస్టెంట్లు ఐవీబీపీ తేజ, యు.వెంకట్ కుమార్ బదిలీ అయ్యారు. ఏపీలో 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారక తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు.


రెవెన్యూ శాఖలో వసూళ్ల పర్వం

రెవెన్యూ శాఖలో వసూళ్ల పర్వానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కింది నుంచి పైదాకా చేతులు చాపే వ్యవహారం నడుస్తోంది. ఏ చిన్నపనికైనా బేరసారాలు మాట్లాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది తహసీల్దార్లు లంచాలు తీసుకుంటూ సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే. పలువురు తహసీల్దార్లు, డీటీలు, ఇతర రెవెన్యూ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. అయినా ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.

పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు తహసీల్దార్‌ కార్యాలయాలకు అవినీతి మకిలీ పట్టుకుంది. సస్పెన్షన్లు, హెచ్చరికలు ఉన్నప్పుడే అప్రమత్తమవుతూ ఆ తర్వాత షరా ‘మామూలే’ అన్నట్లుగా వ్యవహరించడం సాధారణమైంది. కొందరు తహసీల్దార్లు ప్రజోపయోగంగా ఉన్నప్పటికీ మరికొందరి అధికారుల తీరుతో రెవెన్యూ శాఖ విమర్శలు మూటగట్టుకుంటోంది.


సమస్యలున్న భూములపై కన్ను

భూముల సమస్యలు, రెవెన్యూ లోపాలపై పూర్తిగా అవగాహన ఉన్న అధికారులు ఏకంగా రియల్‌ వ్యాపారంలోకి దిగారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. లంచాల ద్వారా వచ్చే డబ్బు కన్నా తమ రెవెన్యూ తెలివితో పెట్టే పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తమ దృష్టికి వచ్చిన లోపాలున్న భూములను తమకు అనుకూలంగా సవరించుకొని బినామీల ద్వారా కొనుగోలు చేయిస్తున్న పరిస్థితి దాపురించింది. పలువురు రెవెన్యూ అధికారులు తాము పనిచేస్తున్న మండలాల్లోనే ఇలాంటి భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారనే పుకార్లు వచ్చాయి.


వివాదాస్పద భూములకూ క్లీన్‌చిట్‌..

ఇక ఏళ్ల తరబడి నిషేధిత జాబితాలో ఉన్న వివాదాస్పద భూములకూ క్లీన్‌చిట్‌ ఇవ్వడానికి లక్షల్లో బేరసారాలు కుదుర్చుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. వివాదాస్పద భూములను రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచానికి బదులుగా అనుమానాలు తలెత్తకుండా బినామీల పేరిట కొంత స్థలాలనే లంచాలుగా డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేవు. నెలవారీ లెక్కల్లో తేడాలు లేకుండా చూసుకుంటే ఎంతకైనా తెగించొచ్చనే స్థాయిలో కొందరు అధికారుల తీరు ఉన్నట్లుగా పలు పరిణామాలు రుజువు చేస్తున్నాయి.


పర్యవేక్షణ లేకనే ఇష్టారాజ్యం

అనుభవం కలిగిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు జిల్లా కలెక్టర్లుగా ఉన్నారు. రెవెన్యూశాఖకు సంబంధించి జిల్లాలో ప్రత్యేకంగా అదనపు కలెక్టర్‌ ఉన్నారు. డీఆర్వోతోపాటు ఏళ్ల తరబడిగా ఉన్న ఆర్డీవోలు ఉన్నారు. అయితే తహసీల్దార్‌ కార్యాలయాలపై సరైన పర్యవేక్షణ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ అధికారులపై గతంలో కలెక్టర్‌ కొరఢా ఝుళిపించినప్పటికీ మిగతా అధికారుల్లో మార్పు కానరావడం లేదనే ఆరోపణలున్నాయి. రిజిస్ట్రే షన్లు, సర్టిఫికెట్ల మంజూరు తదితర విషయాలపై క్షేత్రస్థాయిలో నిఘా లేకనే ప్రజలను పీడిస్తున్న పరిస్థితి నెలకొందనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో చాలా నియోజకవర్గంలోని తహసీల్దార్‌ కార్యాలయాలపై ఇటీవల అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనుల సర్వేలు, పరిహార చెల్లింపుల్లో రెవెన్యూ ఉన్నతాధికారులకు పనిభారం ఉంది. దీంతో తహసీల్దార్‌ కార్యాలయాలపై దృష్టి సారించడం లేదనే అభిప్రాయం నెలకొన్నప్పటికీ, దీనిని అదనుగా చేసుకొని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Chennai: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రాకెట్‌ లాంఛర్‌ లభ్యం

KA Paul: సుప్రీంకోర్టులో కేఏపాల్‌కు చుక్కెదురు

YCP Kethi Reddy: ప్యాలెస్‌ను ఖాళీ చేయండి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫామ్ హౌస్‌కు నోటీసులు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 07:16 PM