ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: సీతారాం ఏచూరి మరణం కార్మిక వర్గాలకు తీరని లోటు

ABN, Publish Date - Sep 12 , 2024 | 06:42 PM

వామపక్ష యోధుడు సీతారామ్ ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సీతారామ్ ఏచూరి దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు.

Pawan Kalyan

అమరావతి: వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సీతారాం ఏచూరి దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సీతారాం ఏచూరి కోలుకుంటారని భావించానని తెలిపారు. ఆయన మరణం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు.


ALSO READ: Sitaram Yechury: సీతారాం ఏచూరి కన్నుమూత

ఎమర్జెన్సీ సమయంలో ప్రజల ప్రాథమిక హక్కుల కోసం బలంగా పోరాడుతూ అజ్ఞాతంలోకి వెళ్లారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎన్నో ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకువచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారాన్ని అందుకున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విదేశాంగ విధానం, ఆర్థిక అంశాలు, పారిశ్రామిక, వాణిజ్య విధానాలపై తన ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ వ్యాసాలు రాశారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.


ALSO READ:

ఎస్.ఎఫ్.ఐ. జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులుగా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏ పదవిలో ఉన్నా ఏచూరి తన అభిప్రాయాలను సూటిగా వెల్లడించారని పవన్ కళ్యాణ్ అన్నారు. వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి అస్తమయం పేద, కార్మిక వర్గాలకు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Sitaram Yechury: విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి.. ఏచూరి జీవిత విశేషాలు


YS Sharmila: ఏలేరు ఆధునికీకరణను జరగకపోవడం వల్లే ఇంతటి విపత్తు

Nimmala: బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులును తీసుకొస్తున్నాం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 12 , 2024 | 06:51 PM

Advertising
Advertising