Pawan Kalyan: వైసీపీలో వాళ్లను వదలం..పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్
ABN, Publish Date - Nov 22 , 2024 | 10:35 AM
జగన్ ప్రభుత్వం రూ.13వేల కోట్లు దారి మళ్లించిందని. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డుల్లో అవకతవకలపై చర్యలు తప్పని సరిగా తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసన సభ ప్రారంభంమైంది. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఈరోజు పీఏసీ కమిటీకి ఎన్నిక కానుంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడంతో ఓటింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సభ్యుని ఎన్నికకు 20 మంది ఎమ్మెల్యేలు సంఖ్యా బలం అవసరం. అయితే ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
ఎన్‌ఆర్ఈజీఎస్ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ అనేది డిమాండ్ ఆధారిత పథకమని తెలిపారు.నైపుణ్యం లేని మ్యానువల్ పనిని చేయడానికి వయోజనులకు 100 రోజలు పనిని కల్పిస్తున్నామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్‌లో కొత్తగా పనికోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అయిదు కిలోమీటర్లలోపు పనిని కలిపిస్తున్నామని అన్నారు.
చర్యలు తీసుకుంటాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అసెంబ్లీలో సభ్యలు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రూ. 5400 కోట్ల రూపాయలు వేజ్, మెటీరియల్ కాంపౌండ్‌తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం రూ.13వేల కోట్లు దారి మళ్లించిందని. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డుల్లో అవకతవకలపై చర్యలు తప్పని సరిగా తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్జీఈఏస్ సర్వనాశనం: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
గ్రామీణ ప్రాంతంలో పేదల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే పథకం ఇదని తెలుగుదేశం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. 70 నుంచి 80శాతం జాబ్ కార్డులు ఉన్నవారికి 100 దినాలు పనిని కల్పించాలని చెప్పారు. 10శాతం దాటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 100 రోజులు పని లభించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్జీఈఏస్‌ను సర్వనాశనం చేశారని ఆరోపించారు. చివరకు ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్లను కూడా మూసివేశారని మండిపడ్డారు. అరటికి, కొబ్బరి, కొకొ, వక్కకు ఇస్తే పనిదినాలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. గుర్రపుడెక్క తీసుకున్నే అవకాశం ఇస్తే పనిదినాలు పెరుగుతాయని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొ్న్నారు.
22 శాఖల్లో ఎంతమేర బకాయి: పత్తిపాటి పుల్లారావు
ఎన్ఆర్ఈజీఎస్ గతంలో 22 శాఖలతో అనుసంధానం అయి ఉంటుందని తెలుగుదేశం చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. 22 శాఖల్లో ఎంతమేర బకాయి ఉంది. వైసీపీ ఐదేళ్లుగా జీతాలు ఆపేయడం వల్ల 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. గతంలో శ్మశాన వాటికలకు ఎన్ఆర్ఈజీఎస్‌లో ఉండేదని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.
Updated Date - Nov 22 , 2024 | 10:35 AM