ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపులో పురోగతి

ABN, Publish Date - Sep 17 , 2024 | 06:27 PM

ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డం పడిన పడవల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే, ఈ పడవలను తొలగించడం కష్టంగా మారింది. బ్యారేజీ వద్ద నుంచి బండ రాళ్ల దాటి ముందుకు అబ్బులు టీం సభ్యులు తీసుకువచ్చారు. సూయుజ్ గేట్లు వద్ద సేఫ్టీ వాల్ ఉన్న కారణంగా వ్యూహం మార్చారు. సేఫ్టీ వాల్ దెబ్బ తినకుండా వేరే విధానం అమలు చేసి బోట్స్ బయటకు తీయాలని నిర్ణయం తీసుకున్నారు.

అమరావతి: విజయవాడలో భారీ వరదల కారణంగా కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డం పడిన పడవల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే, ఈ పడవలను తొలగించడం కష్టంగా మారింది. ఇప్పటి వరకు దశలవారీగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. కొత్త ప్లాన్ వేసి ఆ పడవలను తొలగించాలని అబ్బులు టీమ్ ప్రయత్నిస్తోంది. ఇవాళ(మంగళవారం) కావడి మంత్ర వ్యూహం చేపట్టింది.


వారు చేపట్టిన కావడి మంత్రం వ్యూహం ఫలిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ బోటు పైకి లేచింది. కావడి బొట్లు నెమ్మదిగా ముందుకు లాగుతున్నారు. ఒక బోటును ఒడ్డుకు తీసుకువచ్చేందుకు అబ్బులు టీం సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. బ్యారేజీ వద్ద నుంచి బండ రాళ్లు దాటి ముందుకు అబ్బులు టీం సభ్యులు తీసుకువచ్చారు. సూయుజ్ గేట్లు వద్ద సేఫ్టీ వాల్ ఉన్న కారణంగా వ్యూహం మార్చారు. సేఫ్టీ వాల్ దెబ్బ తినకుండా వేరే విధానం అమలు చేసి బోట్స్ బయటకు తీయాలని నిర్ణయం తీసుకున్నారు. భారీ కార్గో బోట్లపై టన్ను బరువు ఉన్న గడ్డర్లను వెల్డింగ్ చేసి మునిగిన బోట్‌ను పైకి లేపారు.


అయితే మరోవైపు .. వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేసి బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం గొల్లపూడి నుంచి ఆరు కార్గో పడవలను రప్పించి.. వాటిలో రెండింటిని పూర్తిగా నీటిలో నింపి పడవలకు లాక్ చేయనున్నారు. నదిలో చిక్కుకున్న పడవ నీటిలో మునిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం కలిగింది. లాగే కోద్దీ రోప్, క్రేన్‌పై బరువు పెరుగుతోంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి పది అడుగులు ముందకు తీసుకువచ్చారు. అయితే, నీట మునిగిన పడవను కూడా బయటకు తీసేందుకు రెస్క్యూటీమ్ ప్రయత్నాలు చేస్తోంది.


అండర్ వాటర్ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బోటును డైవింగ్ టీమ్ పూర్తిగా కట్ చేయలేకపోతోంది . ప్రవాహ ఉధృతి కూడా డైవర్లకు ఇబ్బందిగా మారింది. కట్ చేసిన రంధ్రాల నుంచి పడవలోకి నీరు చేరుతోంది. దీంతో కటింగ్ ప్రక్రియను నిలిపివేసి.. భారీ రోప్ సహాయంతో ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇక్కడా సమస్యే ఎదురవుతోంది. పొజిషన్ నుంచి పడవలు అస్సలు కదలడం లేదు. దీంతో నయా ప్లాన్‌కు అబ్బులు టీమ్ సభ్యులు శ్రీకారం చుట్టారు


ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అటు కృష్ణా నది.. ఇటు బుడమేరు.. మరోవైపు మున్నేరు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఇక నీటి ప్రవాహ ధాటికి ఒడ్డున నిలిపిన భారీ పడవలు సైతం కొట్టుకొచ్చాయి. ఓ మూడు భారీ సైజు పడవలు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డం పడ్డాయి. దీంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఈ పడవలను తొలగించేందుకు ప్రభుత్వం అబ్బులు టీమ్‌ను ఏర్పాటు చేసింది. అబ్బులు టీమ్ ఈ పడవలను తొలగించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.

Updated Date - Sep 17 , 2024 | 06:31 PM

Advertising
Advertising