Raghurama: వైసీపీ ప్రభుత్వంలో భగవంతుడికి భక్తుడిని దూరం చేయాలనే కుట్ర పన్నారు
ABN, Publish Date - Sep 20 , 2024 | 10:51 PM
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ వివాదంపై హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులంతా వైసీపీ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ వివాదంలో ఒక్కో విషయం బయటికి వస్తుంటే.. అంతా షాక్ అవుతున్నారు. ఈ వివాదంపై ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు స్పందించారు.
పశ్చిమగోదావరి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ వివాదంపై హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులంతా వైసీపీ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ వివాదంలో ఒక్కో విషయం బయటకు వస్తుంటే.. అంతా షాక్ అవుతున్నారు. ఈ వివాదంపై ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు స్పందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ... భగవంతుడికి భక్తుడిని దూరం చేయటం ఎలా అనే క్రిమినల్ ఆలోచనతో గత ఐదు సంవత్సరాలు టీటీడీ బోర్డు నడిచింది అన్నది పచ్చి నిజమని ఆరోపించారు. దానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి మతం అభిమతమని రఘురామకృష్ణం రాజు విమర్శలు చేశారు.
తిరుమలలో వాటర్ బాటిల్ 60 రూపాయలు వారు అమ్మిందే కొనాలి... అదంతా వైసీపీ బ్యాచ్ అని విమర్శించారు. సువర్టుపురం దొంగళ్లా వైసీపీ నేతలు తిరుమలను దోచేశారని విమర్శలు చేశారు. భక్తులను చిత్ర హింసలకు గురిచేసి ఎంత డిమాండ్ తగ్గించాలని ఎన్ని కుట్రలు చేసినా భక్తులు వస్తూనే ఉన్నారని.. అది స్వామి వారి మహత్యమని చెప్పారు. ఒక భక్తుడిగా చెబుతున్నా గత ఐదు సంవత్సరాల్లో భక్తులను ఇబ్బంది పెట్టే కమర్షియల్ ఆర్గనైజేషన్‌గా టీటీడీ బోర్డు మారిందనే మాట పచ్చి నిజమని ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఆరోపించారు.
Updated Date - Sep 20 , 2024 | 11:14 PM