Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 02 , 2024 | 05:47 PM
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ఒంగోలు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు. అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో సంచలన సినీ దర్శకుడు(Director) రామ్ గోపాల్ వర్మపై (Ram Gopal Varma) పలు పోలీస్ స్టేషన్లలో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. అయితే నవంబర్ 25న ఒంగోలు పీఎస్‌లో విచారణకు రావాల్సి ఉండగా.. అదే రోజు ఆయన విచారణకు రాకుండా గైర్హాజరయ్యారు. అప్పటి నుంచి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కొన్ని రోజుల క్రితం రాంగోపాల్ వర్మ ఒక వీడియో విడుదల చేశారు. తానెక్కడికి పారిపోలేదని, పోలీసులు విచారణకు పిలిస్తే తాను వెంటనే విచారణకు రావాలా.. అంటూ ఎదురు ప్రశ్నిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియో ఎక్కడి నుంచి విడుదల చేశారన్న కోణంలో ఐటీ సిబ్బంది ఆరా తీశారు. అయితే రాంగోపాల్ వర్మ విచారణకు రాకుండా కోర్టుల నుంచి రక్షణ పొందేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఒంగోలు పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. అయితే ఈ కేసులపై రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాకు బెయిల్ రాలేదు..
‘‘ఎప్పుడో సంవత్సరం క్రితం ట్వీట్ పెట్టాను.. అప్పుడు ఎది పెట్టానో నాకు నో నాలెడ్జ్.. కానీ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయ్.. ఎవరు పట్టించుకోనిది .. వారు ఎందుకు పట్టించుకున్నారు. యాంటిసిపిటరీ బెయిల్ ..మనకున్న అనుమానాలను బట్టి కోర్ట్ ఇస్తుంది. నాకు బెయిల్ రాలేదు... నవంబర్ 25తేదీన 10 గంటలకు నేను పొలీసులకు రిప్లై ఇచ్చాను. 20 నిమిషాల్లో పొలీసులు వచ్చారు. అది కూడా మీడియాతో వచ్చారు. నేనప్పుడు డెన్‌లో లేను.. కానీ నాపై రకరకాల స్టోరీలు వచ్చాయి. పోలీసులు ఎక్కడా నా కేసు గురించి మాట్లాడింది లేదు.. మొత్తం మీడియానే నాపై స్క్రిప్ట్ రాసింది. సోషల్ మీడియాను కంట్రోల్ చేయటం ఎవరితరం అవుతుంది. నేను ట్రంప్‌పై కమలా హారిస్‌పై కొద్ది రోజుల క్రితం మీమ్ పెడితే.. రకరకాల ఓపినీయన్స్ , కామెంట్స్ వచ్చాయి.. కానీ దాన్నెవరు పట్టించుకోరు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వార్తకు వాల్యూ ఉంటుంది.. నాపై అసత్య ఆరోపణలు ప్రసారమయ్యాయి. నాపై పెట్టింది అఫెన్సీవ్ కేసు.. సినిమాకు సెన్సార్ బోర్డ్ ఉంటుంది. ప్రతిది డిసైడ్ చేసి సర్టిఫికెట్ ఇస్తుంది. సోషల్ మీడియాకు అది లేదు.. ఇది నాకు కాకుండా వేరే వారిపై వార్తలు వచ్చుంటే ఎంజాయ్ చేసేడవాడిని. ఏదైనా నెగిటివ్ థంబ్ ఉంటేనే చూస్తారు. నేను చెప్పేది ఎంటంటే.. నాపై కావాలనే రకరకాల ప్రాంతాల్లో ఫిర్యాదులు ఇచ్చారు’’ అని రామ్ గోపాల్ వర్మ మండిపడ్డారు.
కేసులపై పిటిషన్
సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇకపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాణిని సోమాయాజి స్పందిస్తూ... ఈ కేసులో అడ్వకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపిస్తారన్నారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది టి.రాజగోపాలన్ వాదనలు వినిపిస్తూ... ఒకే పోస్టుకు సంబంధించి పిటిషనర్‌పై వివిధ పోలీసుస్టేషన్లలో వరుస కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరుతున్నారన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును ప్రధాన కేసుగా భావించి, తర్వాత నమోదైన కేసులను వాంగ్మూలాలుగా తీసుకోవాలని అభ్యర్థించారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి .. విచారణను వాయిదా వేశారు.
ఏపీ హైకోర్టు ఝలక్ ..
అయితే.. సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. క్వాష్ పిటిషన్‌లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలన్న రామ్‌గోపాల్ వర్మ తరఫు న్యాయవాది అభ్యర్థననూ తోసిపుచ్చింది. ఈ తరహా అభ్యర్థనను సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) వద్ద చేసుకోవాలని, కోర్టు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని పేర్కొంది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముత్తనపల్లి రామలింగయ్యకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో రాంగోపాల్ వర్మ విచారణకు హాజరు కావడం అనివార్యమైంది.
ఇంకా అజ్ఞాతంలోనే రామ్‌గోపాల్‌వర్మ..
మరోవైపు.. రామ్‌గోపాల్‌వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ఒంగోలు పోలీసులు (Ongole Police) గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ (Telangana), తమిళనాడు (Tamilnadu) రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు. అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఆర్జీవీ ముందస్తు బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. నవంబర్ 25న ఒంగోలు పీఎస్‌లో విచారణకు రావాల్సి ఉండగా.. అదే రోజు ఆయన విచారణకు రాకుండా గైర్హాజరయ్యారు. అప్పటి నుంచి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కొన్ని రోజుల క్రితం రాంగోపాల్ వర్మ ఒక వీడియో విడుదల చేశారు. తానెక్కడికి పారిపోలేదని, పోలీసులు విచారణకు పిలిస్తే తాను వెంటనే విచారణకు రావాలా.. అంటూ ఎదురు ప్రశ్నిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియో ఎక్కడి నుంచి విడుదల చేశారన్న కోణంలో ఐటీ సిబ్బంది ఆరా తీస్తున్నారు. అయితే రాంగోపాల్ వర్మ విచారణకు రాకుండా కోర్టుల నుంచి రక్షణ పొందేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఒంగోలు పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. వర్మకు హైకోర్టులో బెయిల్ పిటిషన్ లభిస్తే రాంగోపాల్ వర్మ అప్పుడైనా వెలుగులోకి వస్తారా.. బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయితే అజ్ఞాతంలోనే ఉంటారా అన్నది ఉత్కంఠంగా మారింది. రాంగోపాల్ వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు మద్దిపాడులో నమోదైన కేసులో రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Ap Govt : రాష్ట్ర కేబినెట్ భేటీ రేపే
YS Sharmila: ఇదో జాతీయ స్థాయి కుంభకోణం
Botsa Satyanarayana: డిప్యూటీ సీఎం పవన్‌ని చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుంది
For AndhraPradesh News And Telugu news
Updated Date - Dec 02 , 2024 | 05:59 PM