AP GOVT: తిరుమల లడ్డూ వివాదం.. సిట్ నియామకం
ABN, Publish Date - Sep 24 , 2024 | 06:03 PM
తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో ఈ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ని ఏపీ ప్రభుత్వం ఇవాళ(మంగళవారం) నియమించింది. గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వ శ్రేష్ఠ త్రిపాటిని సిట్ అధిపతిగా నియమించింది. సిట్ డీఐజీగా విశాఖ రేంజ్‌లో పనిచేసిన గోపీనాథ్ జెట్టిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నియమించారు. సిట్ ఎస్పీగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును నియమించారు. మరి కాసేపట్లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుంది. ఈ సిట్ టీమ్‌లో మరి కొంతమంది డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలను ఏపీ ప్రభుత్వం నియమించనుంది.
ALSO READ: CM Chandrababu: నామినేటెడ్ పదవుల భర్తీ.. ఎంతమందికి అంటే
మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన నిజనిజాలు వెలుగులోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ ఘోర అపచారం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. సోమవారం శాంతి హోమం నిర్వహించింది. అనంతరం శ్రీవారు కొలువు దీరిన ఆనంద నిలయంతోపాటు తిరుమాడ వీధుల్లో తిరుమల పూజారులు సంప్రోక్షణ నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP GOVT: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ధాన్యం కొనుగోలుపై కీలక ప్రకటన
Konakalla Narayana Rao: సీఎం సముచిత స్థానం కల్పించారు
Ganta: అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ.. పాల్గొన్న గంటా
Read Latest AP News and Telugu News
Updated Date - Sep 24 , 2024 | 06:38 PM