ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Mopidevi: వైసీపీకి భారీ షాక్.. రాజీనామా చేయనున్న ఎంపీ మోపిదేవి..

ABN, Publish Date - Aug 28 , 2024 | 12:07 PM

వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది. వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఆయన రేపు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

Mopidevi Venkata Ramana

బాపట్ల: వైసీపీ(YSRCP)కి మరో భారీ షాక్ తగలనుంది. వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మోపిదేవి వెంకటరమణ(Mopidevi Venkata Ramana) ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఆయన రేపు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సమక్షంలో టీడీపీ చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు మరో నేత ఝలక్ ఇచ్చినట్లు అవుతుంది. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఇప్పటికే పలువురు కీలక నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు.



వైసీపీకి కీలక నేతల రాజీనామా

మరో వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన శిద్ధా రాఘవరావు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. తర్వాత 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయనకు మెుండి చేయి చూపించడంతో ఇటీవల రాజీనామా చేశారు.


ప్రాధాన్యత లేదు..

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యత సరైన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు తెలిపారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఎలాంటి పదవులు ఆశించడం లేదని, ప్రజలకు మంచి జరగాలన్నదే తన కోరిక అని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ వీడుతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.



కూటమిలో చేరతా

టీడీపీ, జనసేన, బీజీపీ కూటమిలోని ఏదో ఒక పార్టీలో తాను చేరుతానని మాజీ ఎమ్మెల్యే దొరబాబు స్పష్టం చేశారు. అన్నీ పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయని, అనుచరులతో చర్చించిన తర్వాతే భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో 25 ఏళ్లుగా మమేకమై ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తన వెంట ఇప్పటివరకూ నడిచిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని చెప్పారు. పిఠాపురంలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించారు.


మద్దాలి గిరి, కిలారి రోశయ్య కూడా..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతు తెలిపారు. 2014 ఎన్నికల్లో జగన్ ఆయనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు. మనస్తాపం చెంది పార్టీని వీడారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య సైతం ఈ మధ్య వైసీపీకి రాజీనామా చేశారు. రోశయ్య ఇటీవల గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.

ఈ వార్తలు కూడా చదవండి:

AP Cabinet: నిరుద్యోగులకు శుభవార్త..

Sand Robbery: ఇసుక మాయంపై మంత్రి వాసంశెట్టి ఆగ్రహం..

Updated Date - Aug 28 , 2024 | 01:20 PM

Advertising
Advertising
<