ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Govt: వైసీపీ విధ్వంసంపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్న టీడీపీ ప్రభుత్వం..

ABN, Publish Date - Jun 12 , 2024 | 07:46 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల వైసీపీ(YSRCP) పాలనలోజరిగిన అవకతవకలు, విధ్వంసంపై టీడీపీ ప్రభుత్వం(TDP government) శ్వేతపత్రాలు (White Papers) విడుదల చేయనుంది. రాష్ట్రంలో విధ్వంసంపై శాఖల వారీగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల వైసీపీ(YSRCP) పాలనలోజరిగిన అవకతవకలు, విధ్వంసంపై టీడీపీ ప్రభుత్వం(TDP government) శ్వేతపత్రాలు (White Papers) విడుదల చేయనుంది. రాష్ట్రంలో విధ్వంసంపై శాఖల వారీగా విడుదల చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అక్రమాలపై వరసగా శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర విభజనకు పూర్వం కాంగ్రెస్ హయాంలో జరిగిన విధ్వంసాలపైనా 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇలాగే స్వేతపత్రాలు విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ మెుదలైంది.


వైసీపీ హయాంలో ఇసుక, మద్యం పాలసీలపై అప్పటి ప్రతిపక్షాలు విపరీతంగా ఆరోపణలు చేశాయి. ఇసుక ఇష్టానుసారం తోడేస్తున్నారని, కల్తీ మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. గనుల శాఖలోనూ పలు అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రస్తుతం శ్వేతపత్రాలు విడుదల చేయనున్న నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు బయటపడనున్నాయో వేచి చూడాల్సిందే.

Updated Date - Jun 12 , 2024 | 07:46 PM

Advertising
Advertising