ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: చంద్రబాబు ఇంటికి సీనియర్ నేతల క్యూ.. కారణమిదే..?

ABN, Publish Date - Feb 25 , 2024 | 06:19 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన(TDP - Janasena) కూటమి జెట్ స్పీడులో దూసుకెళ్తున్నాయి. వ్యూహంలో భాగంగా శనివారం నాడు ఈ రెండు పార్టీల అధినేతలు కలిసి తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ అభ్యర్థులను ఢీకొట్టేలా టీడీపీ - జనసేన అభ్యర్థులను ఆ పార్టీల అగ్రనేతలు ప్రకటించారు.

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన(TDP - Janasena) కూటమి జెట్ స్పీడులో దూసుకెళ్తున్నాయి. వ్యూహంలో భాగంగా శనివారం నాడు ఈ రెండు పార్టీల అధినేతలు కలిసి తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ అభ్యర్థులను ఢీకొట్టేలా టీడీపీ - జనసేన అభ్యర్థులను ప్రకటించారు. అయితే తొలి జాబితాలో పేరు దక్కని సీనియర్ నేతలను తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాన్‌లో భాగంగా ఈరోజు(ఆదివారం) ఉండవల్లిలోని నివాసానికి ఆయా నేతలు రావాలని పిలిపించారు. చంద్రబాబును వారు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటికే ఆలపాటి రాజా, బొడ్డు వెంకటరమణ, పిల్లా గోవింద్, దేవినేని ఉమా, గంటా శ్రీనివాస్ కలిశారు. సీనియర్లకు టికెట్‌ను ఎందుకు ఇవ్వలేకపోతున్నామన్న విషయాన్ని నేతలకు చంద్రబాబు వివరిస్తున్నారు. కొంతమంది సీనియర్లకు నియోజకవర్గాన్ని ఎందుకు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నది నేతలకు వివరిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా కొన్నిచోట్ల సీనియర్లు త్యాగాలు చేయక తప్పదని చంద్రబాబు నేతలకు సూచించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం నేతలు హర్షం వ్యక్తం చేశారు.

గంటా ఎక్కడి నుంచంటే..

కాగా ...సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాస్‌లతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల్లో కొన్ని కీలక అంశాలను నేతల దృష్టికి చంద్రబాబు తీసుకు వచ్చారు. గంటాను.. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. అయితే భీమిలి టికెట్‌ను గంటా కోరినట్లు సమాచారం. అయితే ప్రత్యామ్నాయంగా మాడుగుల, చోడవరం సెగ్మెంట్లల్లోనూ గంటా పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

దేవినేని సీటుపై ఉత్కంఠ

అయితే.. తొలి జాబితాలో దేవినేని ఉమా పేరు లేకపోవడంపై జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల్లో ప్రధానమైన చర్చ జరుగుతోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ త్వరలో టీడీపీలో చేరుతారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. కృష్ణ ప్రసాద్ కూడా మైలవరం సీటు ఆశించడంతో ఉమా సీటుపై ఉత్కంఠ నెలకొంది. మైలవరం లేదా పెనమలూరు నియోజకవర్గంలో దేవినేనికి ఏదో ఒకటి ఇస్తారంటూ జిల్లావ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది.

Updated Date - Feb 25 , 2024 | 07:07 PM

Advertising
Advertising