ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Guntur: విద్యార్థినిలతో వెకిలి చేష్టలు.. ఉపాధ్యాయుడి గతి ఏమైందంటే..

ABN, Publish Date - Nov 04 , 2024 | 06:20 PM

తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నవీన్ అనే ఉపాధ్యాయుడిగా విద్యార్థినిల పట్ల నీచంగా ప్రవర్తించాడు. బాలికలను అసభ్యంగా తాగుతూ ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చాడు.

గుంటూరు: మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఆడపిల్లలు పుట్టారంటేనే తల్లిదండ్రులు ఒణికిపోయే పరిస్థితులు దాపురించాయి. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యాచారాలు చేస్తూ కామాంధులు రెచ్చిపోతున్నారు. పాఠశాలలు, కాలేజీలు, ఉద్యోగం చేసే చోటా అబలలకు రక్షణ కరవైంది. చివరికి ఇంట్లో ఉన్న వారిపైనా దాడులు చేస్తూ దుర్మార్గులు పేట్రేగిపోతున్నారు. తమ ప్రేమను ఒప్పుకోలేదని ప్రేమోన్మాదులు మారణాయుధాలతో తెగబడుతుంటే, మరోవైపు మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు అత్యాచారాలు చేస్తూ కామాంధులు చెలరేగిపోతున్నారు.


ఇక చిన్నారుల విషయంలోనూ ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. చాక్లెట్లు ఆశ చూపి మరీ అత్యాచారాలు చేస్తూ అతి దారుణంగా హతమారుస్తున్నారు. కామవాంఛలు తీర్చుకునేందుకు అభంశుభం తెలియని పసివారిని బలి తీసుకుంటున్నారు. ఆ లిస్టులో కొంతమంది కీచక ఉపాధ్యాయులు సైతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కామాంధులుగా మారిపోయి నీచంగా ప్రవర్తిస్తున్నారు. భావి తరాన్ని గాడిన పెట్టాల్సిన వారే గాడి తప్పుతున్నారు. ఇటువంటి ఉద్దంతాలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.


తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నవీన్ అనే ఉపాధ్యాయుడిగా విద్యార్థినిల పట్ల నీచంగా ప్రవర్తించాడు. బాలికలను అసభ్యంగా తాగుతూ ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చాడు. పాఠశాలకు వస్తున్న చిన్నారులతో తమ కామవాంఛలు తీర్చుకోవాలని చూశాడు నవీన్. రోజూ వారితో అసభ్యంగా మాట్లాడుతూ కొంతమంది బాలికలను చెప్పలేని విధంగా తాకేవాడు. అతని చేష్టలను భరించలేని విద్యార్థినిలు ఇవాళ(సోమవారం) తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. దీంతో ఆగ్రహించిన పేరెంట్స్ వెంటనే పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని వారంతా నిలదీశారు. అనంతరం నవీన్‌కు దేహశుద్ధి చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవ పెద్దది కావడంతో పాఠశాల యాజమాన్యం అతన్ని విధుల నుంచి తొలగించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి..

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్‌ బుకింగ్‌, ట్రాకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ సూపర్‌ యాప్‌..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 06:22 PM