AP Budget: బడ్జెట్‌కు ఏపీ మంత్రిమండలి ఆమోదం..

ABN, Publish Date - Nov 11 , 2024 | 10:31 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఛాంబర్‌లో రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

AP Budget: బడ్జెట్‌కు ఏపీ మంత్రిమండలి ఆమోదం..
AP Assembly

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఛాంబర్‌లో రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నేటి (సోమవారం) నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత నిస్తూ ఆర్థిక శాఖ బడ్జెట్‌ను రూపొందించింది. కాగా, మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 10:32 AM