ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..

ABN, Publish Date - Oct 14 , 2024 | 10:13 PM

భారీ వర్షాలకు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మాచవరం వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైల్వే ట్రాక్ కుంగిపోయింది.

గుంటూరు: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు కోటి రూపాయల చొప్పున అత్యవసర నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సమీక్ష నిర్వహించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో జోరు వానలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. మరోవైపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.


భారీ వర్షాలకు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మాచవరం వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైల్వే ట్రాక్ కుంగిపోయింది. దీంతో విజయవాడ- చెన్నై మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ సైతం నిలిచిపోయింది. రైలును వెనక్కు మళ్లించి అప్పికట్ల స్టేషన్‌ వద్ద అధికారులు నిలిపివేశారు. బాపట్ల తీసుకెళ్లి మూడో లైన్ ద్వారా హైదరాబాద్ పంపించాలని భావిస్తున్నారు. మాచవరం వద్ద ట్రాక్ మరమ్మతు పనులు అధికారులు చేపట్టగా.. జోరు వర్షం కురుస్తుండటంతో పనులకు ఆటంకం కలుగుతోంది. అలాగే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

Updated Date - Oct 14 , 2024 | 10:13 PM