Guntur: సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ అదనపు ఈవో.. విషయం ఏంటంటే..
ABN, Publish Date - Dec 10 , 2024 | 09:03 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన్ని వెంకయ్య చౌదరి కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన్ని వెంకయ్య చౌదరి కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తిరుమల స్వామివారి ప్రసాదాన్ని సీఎంకు అదనపు ఈవో అందజేశారు. అనంతరం కాసేపు చంద్రబాబుతో ముచ్చటించారు. తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రికి వెంకయ్య చౌదరి వివరించారు.
ఏఏ పనులు జరుగుతున్నాయి, ఎంత మేర జరిగాయనే అంశాలను సీఎంకు వివరించారు. అలాగే వైసీపీ హయాంలో స్వామివారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కాగా.. ప్రస్తుతం లడ్డూ తయారీలో నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నట్లు చంద్రబాబుకు చెప్పారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి కోసం చేస్తున్న ఏర్పాట్లను సైతం పూసగుచ్చినట్లు వివరించారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం చర్యలు చేపట్టాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP News: హోంమంత్రి అనితకు ఏపీ హైకోర్టులో ఊరట.. ఎందుకంటే..
Visakha: జాయ్ జమీమా.. మాజీ ఎంపీ హర్ష కుమార్ వ్యాఖ్యలను ఖండించిన బాధితుడి తల్లి..
Updated Date - Dec 10 , 2024 | 09:07 PM