ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: రఘురామ టార్చర్ కేసులో.. ఆ అధికారి అరెస్ట్

ABN, Publish Date - Nov 26 , 2024 | 07:29 PM

డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణమరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రకాశం: డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణమరాజు (Raghurama krishnamraju) కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను (Retired CID ASP Vijaypal) పోలీసులు ఇవాళ(మంగళవారం) అరెస్ట్ చేశారు. విజయ్‌పాల్ రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. గుంటూరుకు విజయ్‌పాల్‌ను పోలీసులు తరలించనున్నారు. నిన్న(సోమవారం) సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. బెయిల్ రాకపోవడంతో ప్రకాశం ఎస్పీ ఎదుట విచారణకు విజయ్‌పాల్ హాజరయ్యారు. విచారణ తర్వాత విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా.. ఒంగోలు (Ongole) ఎస్పీ కార్యాలయంలో (SP Office) విచారణకు సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ఈరోజు హాజరయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. రఘురామను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో అప్పుటి సీఐడీ ఏఎస్పీ విజయపాల్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 13న కూడా విజయ్ పాల్‌ను ఇక్కడే విచారణ జరిపారు. 50 ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా సమాధానాలు ఇచ్చారు. ‘ఏమో తెలియదు.. గుర్తు లేదు.. మరిచిపోయా’ అంటూ సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరోసారి నోటీసులు జారీ చేసి విచారించారు.


విజయ్‌పాల్‌‌కు ఎదురుదెబ్బ

కాగా.. ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ (Vijaypal)కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన నేపథ్యంలో బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును విజయ్‌పాల్‌ ఆశ్రయించారు. అయితే దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, విజయ్‌పాల్‌ తరఫు న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న అనంతరం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బి.వరలే ధర్మాసనం విజయపాల్ పిటిషన్‌ను కొట్టివేసింది.


రఘురామకు సుప్రీంకోర్టు బెయిల్‌...

అసలు కస్టోడియల్‌ టార్చరే జరగలేదని, అరెస్టు వ్యవహారంతో విజయ్ పాల్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు విపిపించారు. 2021లో ఘటన జరిగితే మూడేళ్ల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరుపుతున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనానికి సింఘ్వీ తెలిపారు. ఇప్పటివరకూ ఏ కోర్టూ రఘురామను టార్చర్‌ చేసినట్లు ధ్రువీకరించలేదని ఆయన చెప్పారు. రఘురామ అరెస్టు కావడంతో సుప్రీంకోర్టే బెయిల్‌ ఇచ్చి అతన్ని ఆర్మీ ఆస్పత్రికి చికిత్స కోసం పంపించిన తీరును ధర్మాసనానికి ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్ర వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదిక కూడా ఇచ్చిందని, దానిలో స్పష్టంగా అన్ని అంశాలూ ఉన్నాయని లూథ్ర తెలిపారు.


రఘురామ న్యాయ పోరాటం..

2021 నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజూ రఘురామకృష్ణరాజు ఖాళీగా కూర్చోలేదని, న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారని సుప్రీంకోర్టుకు ఆయన తరఫు న్యాయవాది సుయోధన్‌ చెప్పారు. రఘురామను మేజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశపెట్టినప్పుడు ఆయన కాళ్లకైన గాయాలను న్యాయాధికారికి చూపగా... ఆ వివరాలను అధికారికంగా నమోదు చేశారని ధర్మాసనానికి సుయోధన్‌ చెప్పారు. సుప్రీంకోర్టు సూచనలతో స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఏపీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఆయన సుప్రీంకోర్టుకు వెల్లడించారు. ఇంకా ఆ పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌లోనే ఉందని రఘురామ న్యాయవాది చెప్పారు. మరోసారి వాదనలు వినిపించేందుకు సిద్ధం కాగా.. మేజిస్ట్రేట్‌ నమోదు చేసిన వివరాలపై సమాధానం ఉందా? అంటూ విజయ్‌పాల్‌ న్యాయవాది సింఘ్వీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కేసు విచారణను సుప్రీంకోర్టు ముగించింది. విజయ్‌పాల్‌ పిటిషన్‌ కొట్టివేస్తూ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బి.వరలే ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Updated Date - Nov 26 , 2024 | 07:38 PM