AP HighCourt: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్‌కు అన్ని శాఖల అధికారాలు ఇవ్వడంపై హైకోర్టులో విచారణ
ABN, Publish Date - Mar 15 , 2024 | 03:22 PM
Andhrapradesh: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అన్ని శాఖల అధికారాలు ఇవ్వడంపై హైకోర్ట్‌లో శుక్రవారం విచారణ జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విజిలెన్స్ ఐజీ రఘురామిరెడ్డి పంపిన ప్రతిపాదనలపై స్టే ఇవ్వాలని లోకేష్ కోరారు. టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టేందుకే ఈ ప్రతిపాదన అని పేర్కొన్నారు.
అమరావతి, మార్చి 15: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అన్ని శాఖల అధికారాలు ఇవ్వడంపై హైకోర్ట్‌లో (AP HighCourt) శుక్రవారం విచారణ జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) వేసిన పిటిషన్‌పై ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విజిలెన్స్ ఐజీ రఘురామిరెడ్డి పంపిన ప్రతిపాదనలపై స్టే ఇవ్వాలని లోకేష్ కోరారు. టీడీపీ నేతలను (TDP Leaders) ఇబ్బందులు పెట్టేందుకే ఈ ప్రతిపాదన అని పేర్కొన్నారు. లోకేష్ పిటీషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. విజిలెన్స్ ఐజీ పంపినవి ప్రతిపాదనలు మాత్రమేనని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తాము ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. తాము న్యాయ విభాగానికి పంపగా ఇది విధానపరమైన నిర్ణయం అని... ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పిందని ప్రభుత్వ లాయర్ తెలిపారు. కేవలం ప్రతిపాదన మాత్రమే ఉందని లాయర్ చెప్పారు. ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది చెప్పిన అంశాన్ని రికార్డ్ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
AP News: వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు.. ఆయనకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటున్న నేతలు
ED Raids: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ రైడ్స్
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 15 , 2024 | 03:32 PM