ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు

ABN, Publish Date - Dec 26 , 2024 | 07:43 PM

Heavy rains in Telugu States: అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే తెలంగాణలో సైతం అల్పపీడన ప్రభావం కన్పిస్తోంది.

Rains in Telugu States

అమరావతి/ హైదరాబాద్, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పట్లో వర్షం వీడేలా లేదు. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న 3 రోజులు వాతావరణం ఇలా ఉండనుంది. కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ అల్పపీడన ప్రభావంతో 1.5 కిలోమీటర్ల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. ఇక ఈ అల్పపీడనం కారణంగా తీరం వెంట గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో వైపు తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం కన్పిస్తోంది. రెండు రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.


రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని పేర్కొంది. చలి తీవ్రత సైతం పెరిగే అవకాశం ఉన్నందన వృద్దులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Also Read: ఉపవాస దీక్ష.. బూట్లు ధరించను అంటూ అన్నామలై కీలక నిర్ణయం

Also Read: జగన్ మాట్లాడే ప్రతి మాట అబద్దాల మూట

Also Read: పాన్ 2.0 వెర్షన్‌పై స్పష్టత ఇచ్చిన కేంద్రం


ఇక డిసెంబర్ 26వ తేదీన ఉత్తర కోస్తాతోపాటు యానాంలో.. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశముందని.. ఈదురు గాలులు సైతం గంటకు 30-40 కిలోమీటర్లు.. గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే డిసెంబర్ 27వ తేదీన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. కురిసే అవకాశముందని తెలిపింది. డిసెంబర్ 28న వాతావరణం పొడిగా ఉంటుందని వెల్లడించింది.

Also Read: పార్క్ నుంచి పారిపోయిన చిరుత.. ఆందోళనలో ప్రజలు

Also Read: రైతు భరోసా నియమ నిబంధనలు ఇవేనా.. ?


అలాగే దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో డిసెంబర్ 26వ తేదీ.. అంటే ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశముందని వెల్లడించింది. అదే విధంగా డిసెంబర్ 27, 28 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందంది. ఇక రాయలసీమలో డిసెంబర్ 27వ తేదీ అంటే..శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య , చిత్తూరుతోపాటు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులు ప్రకటించారు.

For AndhraPradesh News Telangana News

Updated Date - Dec 26 , 2024 | 07:58 PM