ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NTR Jayanthi: ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దాం.. మోదీతో చంద్రబాబు!

ABN, Publish Date - May 28 , 2024 | 03:01 PM

ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దామంటూ ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ చేసిన ట్వీట్‌కు చంద్రబాబు ఎక్స్‌లో రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ తెర ముందు, తెర వెనకా ఓ లెజెండ్ అని కొనియాడారు. పేదల సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణతో ఎన్టీఆర్ మనందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు.

అమరావతి: ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దామంటూ ప్రధాని మోదీని (PM Modi) టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కోరారు. ఎన్టీఆర్ జయంతి (NTR Jayanthi) సందర్భంగా మోదీ చేసిన ట్వీట్‌కు చంద్రబాబు ఎక్స్‌లో రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ తెర ముందు, తెర వెనకా ఓ లెజెండ్ అని కొనియాడారు. పేదల సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణతో ఎన్టీఆర్ మనందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఎన్టీఆర్ నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తి అందరి హృదయాల్లో ప్రకాశిస్తోందని ప్రధాని మోదీకి ట్వీట్‌కు చంద్రబాబు రిప్లై ఇచ్చారు.


మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయన్ను స్మరించుకుంటూ పోస్టు పెట్టారు. ఎన్టీఆర్ దార్శనికత గల గొప్ప నాయకుడని, తెలుగువారందరికీ ఆయన గర్వకారణమన్నారు. సినీ రంగంలో ఎనలేని సేవలు చేసి మకుఠం లేని మహారాజుగా వెలిగారని కీర్తించారు. ప్రజా సమస్యలు చూసి రాజకీయరంగ ప్రవేశం చేసి ప్రజా సేవకు అంకితమయ్యారన్నారు. ఆయన పరిపాలన దక్షత నేటి తరాలకు స్ఫూర్తి దాయకమన్నారు. ఆయన ఆశన సాధనకు కలిసి పనిచేద్దామంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన చంద్రబాబు.. ఎన్టీఆర్ స్ఫూర్తిని కలిసి కొనసాగిద్దామంటూ ప్రధాని మోదీకి రిప్లై ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

Perni Nani: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై ఫిర్యాదు..

Nara Lokesh: రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్

Updated Date - May 28 , 2024 | 03:30 PM

Advertising
Advertising