Chandrababu : ఇదేం విలాసం!?
ABN, Publish Date - Nov 03 , 2024 | 05:07 AM
విశాఖలో రుషికొండ ప్యాలె్‌సను చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో నిబంధనలను ఇంతగా ఉల్లంఘించగలరా అని ఆశ్చర్యం, ఉద్వేగం కలుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ప్రజాస్వామ్యంతో మరీ ఇంత పరిహాసమా?
ఓ వ్యక్తి సుఖం, స్వార్థం కోసం ఇంత బరితెగింపా?
అధికారం అడ్డంపెట్టుకుని చేసే తప్పులకు
రుషికొండ ప్యాలెస్ ఓ కేస్ స్టడీ: బాబు
14 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన నేను ఏన్నో దేశాలు తిరిగాను. ఎన్నో ప్యాలె్‌సలు చూశాను. కానీ ఒక వ్యక్తి విలాసం కోసం పర్యావరణాన్ని హరించి ప్యాలెస్ కట్టడం ఎక్కడా నేను చూడలేదు. రుషికొండ ప్యాలెస్‌లోని ఫర్నిచర్, షాండ్లియర్స్, కమోడ్స్ చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది. ఒక వ్యక్తి దుర్మార్గంతో ఇలాంటి ప్రయోగాలు చేశాడా అని బాధ కలుగుతోంది. ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టుల కోసం గత ఐదేళ్లలో రూ.400 కోట్లు కూడా జగన్ ఖర్చుపెట్టలేదు. కానీ, కేవలం తన విలాసం కోసం రూ.430 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు.
- సీఎం చంద్రబాబు
జగన్.. ‘ఆంధ్రా ఎస్కోబార్’
వైట్‌హౌ్‌సలోనూ ఇలాంటి కారిడార్ ఉండదు
జగన్ మనసు అర్థం కావడం లేదు
ఎప్పటికీ తానే రాజు.. చక్రవర్తి అనుకున్నారా?
దొంగలకు ఇంత ఇన్నోవేషన్ ఎక్కడిది?
నిబంధనల బేఖాతరు.. పర్యావరణ విధ్వంసం
ప్యాలె్‌సను వీడియో తీసి ప్రజల్లో చర్చకు పెడతాం
ప్యాలెస్ సందర్శనకు ప్రజలకూ అవకాశం ఇస్తాం
వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే భవనాన్ని
దేనికి వాడుకోవాలో నిర్ణయిస్తాం: సీఎం
అధికారులు, మీడియాతో కలిసి ప్యాలెస్ సందర్శన
రాజరికాన్ని తలపిస్తుండడాన్ని చూసి విస్మయం
విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): విశాఖలో రుషికొండ ప్యాలె్‌సను చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో నిబంధనలను ఇంతగా ఉల్లంఘించగలరా అని ఆశ్చర్యం, ఉద్వేగం కలుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారం అడ్డం పెట్టుకుని చేసిన విధ్వంసం, బరితెగింపుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఆయన రుషికొండపై ప్యాలె్‌సను సందర్శించారు. నాలుగు బ్లాక్‌లను నిశితంగా పరిశీలించారు. ప్యాలెస్ బ్లూప్రింట్‌తోపాటు వైశాల్యం, ఒక్కో బ్లాక్‌లో నిర్మాణాల ప్రత్యేకతలు, ఇంటీరియర్, ఫ్లోరింగ్, సీలింగ్ ఫ్యాన్లు, బాత్‌టబ్‌లు, ఇతర సౌకర్యాల గురించి ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అభిషిత్ కిషోర్, పర్యాటక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్.... చంద్రబాబుకు వివరించారు. విజయనగర బ్లాక్‌లోని విలాసవంతమైన బాత్‌రూమ్‌లు, మసాజ్‌రూమ్, మరుగుదొడ్డి కమోడ్‌లు, ఫ్యాన్‌లు, కళింగ బ్లాక్‌లోని విశాలమైన సమావేశ మందిరం, గజపతి, వేంగీ బ్లాక్‌లలో విదేశాల నుంచి తెప్పించిన రాజరికం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఫర్నిచర్, ఇంటీరియర్‌ను చూసి చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘నాగరిక ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అన్నట్టు రుషికొండ ప్యాలె్‌సను నిర్మించారు. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం, స్వార్థం కోసం ఇంతగా బరి తెగించాడా? అని మైండ్‌బ్లోయిం గ్ అయింది. అందుకే జగన్‌ను నేను ‘ఆంధ్రా ఎస్కోబార్’ అనేది.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రుషుల కొండపై ఎందుకింత విలాసం?
‘‘ఇంత విలాసవంతమైన భవనాలను ఎందుకు నిర్మించారో అర్థం కావడం లేదు. రుషులు తపస్సు చేసిన రుషికొండ అంటే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఒక మైలురాయి. అలాంటి రుషికొండకు గుండు కొట్టించారు. పర్యావరణ ప్రేమికులు కొందరు దీనిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు,హైకోర్టుకు ఫిర్యాదు చేసినా, కేంద్రం జోక్యం చేసుకున్నాసరే కనిపించకుండా ప్రజాధనంతో నిర్మాణాలు చేసేశారు. రుషికొండను తవ్వేసి విలాసవంతమైన భవనాలను నిర్మిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో నేను, పవన్‌కల్యాణ్ స్వయంగా చూసేందుకు యత్ని స్తే అడ్డుకున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా ఎలా వ్యవహరించారో చెప్పడానికి ఇదొక కేస్ స్టడీ. ఇప్పుడు ఈ భవనాల వినియోగంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రజలే మాకు అప్పగించడం ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో చెప్పడానికి ఉదాహరణ.
....తవ్వితే చాలామంది అధికారులు పోతారు
‘‘రుషికొండ ప్యాలె్‌సపై నాడు అన్నీ అబద్ధాలే ఆడారు. మొదట పర్యాటక ప్రాజెక్టులని చెప్పారు. ఆ తర్వాత ప్రధాని, రాష్ట్రపతి వంటివారు నగరానికి వస్తే విడిది కోసమని బుకాయించారు. చివరకు అసలు విషయం బయటపడింది. అస లు జగన్ మనస్సు ఏమిటో అర్థం కావడం లేదు. తాను రాజుని, రారాజుని, చక్రవర్తిని అనుకున్నాడో.. లేకపోతే శాశ్వతంగా అధికారంలో ఉండిపోతాననుకున్నాడో ఏమో, తెలియ డం లేదు. ప్యాలెస్ పనులను తవ్వితే చాలామంది అధికారులు పోతారు’’
దొంగలకు ఇంత ఇన్నోవేషనా?
‘‘రాష్ట్రపతి భవన్, వైట్‌హౌ్‌సలో కూడా లేనివిధంగా కారిడార్ ఉంది. దొంగలకు ఇలాంటి ఇన్నోవేషన్ ఎలా వచ్చింది? ప్యాలె్‌సలో పనిచేసే వారికోసం ఒక బ్లాక్ కట్టారు. 200 టన్నుల ఏసీలను ఏర్పాటు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. గత ఐదేళ్లు అణగదొక్కేపాలన సాగింది. దీంతో పత్రికా రంగం కూడా నోరెత్తలేకపోయింది. మళ్లీ దుర్మార్గులు గెలిస్తే విశాఖలో సముద్రాన్ని కూడా మిగిల్చే పరిస్థితి ఉండదు. ప్రధాని, రాష్ట్రపతి విశాఖ వస్తే నేవీ గెస్ట్‌హౌ్‌సలో బస చేస్తారుగానీ, ఇలాంటిచోటకు ఎందుకు వస్తా రు?’’
అప్పుడూ, ఇప్పుడూ పోరాటమే..
‘‘వైసీపీ నేతలు కొందరు ఇప్పుడు ఏవేవో అంశాలపై ప్రభుత్వ అభిప్రా యం అడుగుతున్నారు. ఆ పార్టీ నేతలకు ఏమాత్రం సిగ్గు, ప్రజలంటే భయం ఉంటే రుషికొండ ప్యాలె్‌సపై సమాధానం చెప్పాలి. ఆ పార్టీ నాయకుడే కాదు.. అతన్ని వెనకేసుకొచ్చే నేతలు కూడా బాధ్యత వహించాలి. సంఘ విద్రోహశక్తులతో పోరాటం చేశా. ఇప్పుడు రాజకీయం ముసుగులో తప్పులు చేసిన వారిపై పోరాడుతున్నాను. ఇలాంటి వారిని భావితరాలు కూడా ఛీ కొట్టాలి’’
అందరి సలహాపై రుషికొండపై నిర్ణయం
విశాఖలోని రుషికొండ ప్యాలె్‌సను ఎలా ఉపయోగించాల నే దానిపై అందరి సూచనలు, సలహా లు తీసుకుని నిర్ణయం తీసుకుంటామ ని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ప్రజాధనం అంటే బాధ్యత లేని, ప్రజలంటే లెక్కలేని, ప్రజాస్వామ్యమంటే భయంలేని పాలకులు కట్టిన నిర్మాణాలను మీడియా, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాను. ప్రభుత్వ సొమ్ము రూ.కోట్లు కుమ్మరించి, వ్యక్తిగత విలాసాల కోసం కట్టిన ఈ భవనాలను రాష్ట్రం కోసం ఎలా ఉపయోగించుకోవాలో చర్చిస్తున్నామని ’ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు.
‘‘జగన్ వంటి వ్యక్తులు రాజకీయంగా పనికొస్తారో, లేదో అనేదానితోపాటు రుషికొండ ప్యాలెస్ పేరుతో జగన్ చేసిన అరాచకాన్ని ప్రజల్లో చర్చకు పెడతాం. ప్యాలె్‌సను మొత్తం వీడియో తీసి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లో ఉంచు తాం. ప్రజలను ప్యాలెస్ సందర్శనకు అనుమతి స్తాం. ప్యాలె్‌సపై వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత, దీనిని దేనికి ఉపయోగించుకోవచ్చుననే దానిపై నిర్ణయిస్తాం’’
- సీఎం చంద్రబాబు
Updated Date - Nov 03 , 2024 | 05:07 AM