AP Elections: జగన్‌కు ఓటమి భయం.. పెన్షన్ల పేరిట నీచ రాజకీయం..
ABN, Publish Date - Apr 03 , 2024 | 02:47 PM
వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారు. ఎప్పుడు గద్దె దించుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్న వేళ.. తన చేతకానితనం బయటపడకుండా తప్పించుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ విషయాన్ని రాజకీయం చేస్తూ పేద ప్రజలను సీఎం జగన్ (Jagan) ఇబ్బందులు పెడుతున్నారట. మండుటెండలో పెన్షన్లు తీసుకోవడానికి సచివాలయానికి రావాల్సిందే నంటూ జగన్ మరోసారి తన అరాచకత్వాన్ని చాటుకుంటు న్నారనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారు. ఎప్పుడు గద్దె దించుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్న వేళ.. తన చేతకానితనం బయటపడకుండా తప్పించుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ విషయాన్ని రాజకీయం చేస్తూ పేద ప్రజలను సీఎం జగన్ (Jagan) ఇబ్బందులు పెడుతున్నారట. మండుటెండలో పెన్షన్లు తీసుకోవడానికి సచివాలయానికి రావాల్సిందేనంటూ జగన్ మరోసారి తన అరాచకత్వాన్ని చాటుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పెన్షన్ల ఆలస్యానికి విపక్షాలే కారణమని తెలుగుదేశాన్ని దోషిగా నిలబెట్టాలనే కుట్రకు జగన్ తెరలేపారనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అర్థం చేసుకుంటున్నారు.
Varla Ramaiah: సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గం: వర్ల రామయ్య
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయమంలో సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయించన సందర్భాలున్నాయి. అప్పుడు సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ పూర్తిచేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పెన్షన్ దారులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వేలాది మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. రెండు రోజుల్లో ఇంటింటింకి పెన్షన్ల పంపిణీ పూర్తి చేయ్యొచ్చు. కాని ఫించన్లు ఆలస్యం చేసి ప్రజల్లో విపక్షాలపై వ్యతిరేకత పెరిగేలా జగన్ పెద్ద కుట్ర పన్నారనే ఆరోపణలున్నాయి. అయితే ప్రజలు మాత్రం ఐదేళ్లుగా జగన్ మాయలు, మోసాలు చూశామని.. ఎన్నికల వేళ ఎన్ని కుట్రలు పన్నినా.. తాము మరోసారి మోసపోబోమని ఏపీ ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఇంటింటికి పెన్షన్ పంపిణీ పెద్ద కష్టమేమి కాదని చెప్పారు. అయినా సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారులు ఎన్నికల సంఘం కింద పని చేస్తున్నామనే విషయం మరిచిపోయి.. ఎప్పటిలాగే జగనన్న సేవలో తరించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి చూస్తుంటే చివరికి జగన్ ఆశించింది ఒకటి జరుగుతున్నది మరొకటిలా ఉంది. జగన్ కుట్రలను పసిగట్టిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు.. ఎన్నికల వేళ జగన్ స్వార్థ ప్రయోజనాల కోసం మమల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జగన్ ఆదేశాలతో అధికారులు ఉద్దేశపూర్వకంగానే పెన్షన్ల పంపిణీ ఆలస్యమయ్యేలా చేస్తున్నారని, ప్రజలు ఇబ్బందులు పడేలా చేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోగలిగారు. ఇప్పటికైనా జగన్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పనులు మానుకోవాలని ఏపీ ప్రజలు హితవు పలుకుతున్నారు.
AP Pension: మరీ ఇంతలానా!.. టీడీపీని బద్నాం చేసేందుకు వృద్ధులను వాడేసుకున్న వైసీపీ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 03 , 2024 | 02:48 PM