Big Breaking: తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్
ABN, Publish Date - Sep 27 , 2024 | 02:45 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దైంది. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
తిరుమల: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దైంది. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. జగన్ రాకను అందరూ వ్యతిరేకిస్తున్న వేళ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
తిరుమలకు రావొద్దని డిమాండ్..
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (Former CM YS Jaganmohan Reddy) తిరుమల పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. జగన్ తిరుమలకు రావొద్దంటూ హిందూ సంఘాలు, కూటమి నేతలు పట్టుబడుతున్నారు. జగన్ తిరుమలకు వస్తే కచ్చితంగా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పర్యటన రద్దు కావడం హాట్ టాపిక్‌గా మారింది. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే గుడిలోకి అడుగుపెట్టాలని హిందూ సంఘాలు సహా, కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
గో బ్యాక్ జగన్..
మరోవైపు తిరుమలకు రావొద్దంటూ అలిపిరి వద్ద పలువురు స్వాములు ఆందోళనకు దిగారు. గో బ్యాక్ జగన్ అంటూ శ్రీనివాసానంద స్వామీజీతో పాటు పలువురు స్వాములు నిరసన చేపట్టారు. గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ‘‘జగన్.. మీరు తిరుమలకు రావొద్దు. వస్తే అడ్డుకుని తీరుతాం. మీ వాహనాలు మా సాధుసంతులు, హిందువుల శరీరాల పైనుంచి వెళ్లాల్సిందేతప్ప మిమ్మల్నైతే ఒక్క అడుగుకూడా ముందుకు వెళ్లనివ్వం’’ అని శ్రీనివాసానంద స్వామి స్పష్టం చేశారు. ‘‘క్రైస్తవుడైన జగన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరుమలకు అనుమతించం.
జగన్ ఆలయానికి రావాలని ప్రయత్నిస్తే ఎలాంటి పర్యవసానాలకైనా మేం సిద్ధం. శాంతి భద్రతల సమస్య తలెత్తితే జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. హిందూ ధర్మానికి, వేంకటేశ్వర స్వామికి కళంకం తెచ్చిన, ప్రసాదాన్ని పాడుచేసిన, మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చేసిన జగన్మోహన్‌రెడ్డిని ఒక్క అడుగుకూడా ముందుకు వేయనివ్వం. మీ నిర్వాహకంతో హిందువులంతా తీవ్ర ఆవేదనలో ఉన్నారు’’ అని స్వామీజీలు పేర్కొన్నారు. మరోవైపు డిక్లరేషన్ లేనిదే జగన్ లోపలికి అడుగు పెట్టకూడదని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న వేళ.. జగన్‌కు వ్యతిరేకంగా తిరుపతి వీధుల్లో డిక్లరేషన్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆలయంలోకి ప్రవేశించాలంటే అనుసరించాల్సిన నియమ, నిబంధనలను ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Sep 27 , 2024 | 03:25 PM