ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో ముఖ్య నేత జంప్.!

ABN, Publish Date - Sep 19 , 2024 | 11:47 AM

YSRCP: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా.. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతోంది. బుధవారమే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

YSRCP

అమరావతి, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా.. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతోంది. బుధవారమే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఇప్పుడు మరో ముఖ్యనేత నేత జగన్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట. ఆయన అనుచరులు ఈ విషయాన్ని చెబుతున్నారు.


శుక్రవారం నాడు తన రాజీనామా అంశాన్ని బహిరంగంగా ప్రకటిస్తారని జోరుగా చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై.. నియోజకవర్గ కార్యకర్తలతో ఉదయభాను భేటీ అవనున్నారు. వైసీపీని వీడనున్న ఉదయభాను.. జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేన అధిష్టానంలో ఉదయభాను చర్చలు జరిపారట. జనసేనాని సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెప్టెంబర్ 22వ తేదీన ఉదయభాను జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఉదయభాను.. రెండుసార్లు ప్రభుత్వ విప్‌గా పని చేశారు.


పవన్‌తో బాలినేని భేటీ..

బుధవారం నాడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. పార్టీలో కోటరీ రాజ్యం నడుస్తోందని.. తనను నిర్లక్ష్యం చేశారని బాలినేని ఆరోపించారు. ఇదొక్కటే కాకుండా తాను పార్టీ వీడటానికి అనేక కారణాలు ఉన్నాయని బాలినేని చెప్పుకొచ్చారు. మరోవైపు.. తాను జనసేన అధినేత పవన్‌తో గురువారం భేటీ అవుతానని.. ఆ తరువాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. పవన్‌తో భేటీ తరువాత ఆయన జనసేనలో చేరుతారా? మరేం ప్రకటన చేస్తారో అనే ఉత్కంఠ ఏపీ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అంతేకాదు.. ప్రెస్‌మీట్‌పెట్టి వైసీపీకి సంబంధించి మరికొన్ని అంశాలను వెల్లడిస్తానని ప్రకటించారు. మరి ఆయన ఏం చెబుతారు? జగన్‌పై ఎలాంటి ఆరోపణలు చేస్తారోననే ఉత్సుకత అందరిలోనూ ఉంది.


Also Read:

డాలస్‌లో అక్కినేని శతజయంతి వేడుకలు..

నర్స్ అనుమానాస్పద మృతి కేసులో అసలు నిజం ఇదీ!

హైడ్రా నెక్ట్స్‌ ఫోకస్ అదే...

For More Andhra Pradesh News and Telugu News

Updated Date - Sep 19 , 2024 | 12:07 PM

Advertising
Advertising