AP Election 2024: ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు.. కారణమిదే..?
ABN, Publish Date - Apr 19 , 2024 | 07:46 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని.. తెలుగుదేశం - జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులను భయాభాంత్రుకు గురిచేస్తుందని జనసేన (Janasena) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మారెడ్డి శివశంకర్ రావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగనరెడ్డిపై జనసేన నేతలు ఎన్నికల సంఘాని (Election Commission)కి ఫిర్యాదు చేశారు.
అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) అక్రమాలకు పాల్పడుతోందని.. తెలుగుదేశం - జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులను భయాభాంత్రుకు గురిచేస్తోందని జనసేన (Janasena) ఏపీ ప్రధాన కార్యదర్శి తమ్మారెడ్డి శివశంకర్‌రావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగనరెడ్డిపై జనసేన నేతలు ఎన్నికల సంఘానికి (Election Commission) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఏపీ ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
AP Elections: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఏర్పాట్లపై ఎస్‌ఈసీకి వర్ల రామయ్య లేఖ
ఈ సందర్భంగా శివశంకర్ రావు మాట్లాడుతూ.. సీఎం జగన్ భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై అసభ్యకరంగా కామెంట్స్ చేశారని ఫిర్యాదు చేశారు. సీఈఓని జనసేన తరపున కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. జగన్ ఈనెల 16వ తేదీ భీమవరంలో పవన్ కల్యాణ్‌పై మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడ్డారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి జగన్ మాట్లాడారని చెప్పారు.
YS Sharmila: ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికొస్తాడు?.. గుమ్మనూరుపై షర్మిల ఫైర్
తద్వారా రాష్ట్రంలో మహిళలను తప్పుదోవ పట్టించే విధంగా సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారని విరుచుకుపడ్డారు. ఇలాంటి మాటలతో ఎన్నికల వాతావరణం కలుషితం అవుతుందని చెప్పారు. సానుభూతితో మళ్లీ గెలవాలని జగన్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్‌పై జగన్ చేసిన వ్యాఖ్యల విషయంలో సీఈఓ మీనా చర్యలు తీసుకుంటారనే నమ్మకం తమకు ఉందని శివశంకర్ రావు అన్నారు.
Balakrishna: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు
విశాఖ స్టీల్‌ను ప్రైవేట్ పరం కానివ్వబోం: కొణతాల రామకృష్ణ
అనకాపల్లి జిల్లా: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటామని జనసేన నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ (Konatala Ramakrishna) అన్నారు.
తెలుగుదేశం- జనసేన - బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఇథనాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కొణతాల రామకృష్ణ మాటిచ్చారు.
YS Sunitha: నేను ప్రజల ముందుకొస్తే.. వైసీపీ నేతల్లో వణుకు పుట్టి..
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 19 , 2024 | 08:01 PM