KA Paul: ఏపీని అమెరికా చేసే సత్తా నాకు మాత్రమే ఉంది.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 22 , 2024 | 06:05 PM
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో.. ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దూకుడు పెంచారు. తన మాటల తూటాలకు మరింత పదును పెట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూనే.. తనదైన హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని అమెరికా చేసే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు.
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో.. ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దూకుడు పెంచారు. తన మాటల తూటాలకు మరింత పదును పెట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూనే.. తనదైన హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని అమెరికా చేసే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు. ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్‌పై సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు, విశాఖ నుంచి ఒడిశాకు డ్రగ్స్ వెళ్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఏపీని అమెరికాలా మారుస్తానని ఉద్ఘాటించిన ఆయన.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశాన్ని కాపాడే సత్తా ఒక్క కేఏ పాల్‌కే ఉందని నొక్కి చెప్పారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను (Vizag Steel Plant) కాపాడుకోవడం కోసం కోర్టులో కేసు వేసి పోరాడుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులను జైల్లో వేసే దమ్ము తనకే ఉందని చెప్పుకొచ్చారు. టైం లేదని, నామినేషన్ వేయాల్సిన అవసరం లేదని తాను చెప్పినా.. సినీ నటుడు బాబు మోహన్ (Actor Babu Mohan) వరంగల్‌లో నామినేషన్ వేశారన్నారు. విశాఖపట్నం (Visakhapatnam) నుంచి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు (Chandrababu), జగన్‌లకు (Jagan) ఓటు వేస్తారా? అభివృద్ధి చేస్తానన్న తనకు ఓటు వేస్తారో ప్రజలే తేల్చుకోవాలని చెప్పుకొచ్చారు.
అంతకుముందు సైతం.. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులన్నింటిని తాను తీరుస్తానని, తన పార్టీని గెలిపిస్తే రూ. 50 లక్షల కోట్లు తీసుకొచ్చి ఏపీని అభివృద్ధి చేస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు. రూ.5లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా? అధికారికంగా రూ.5 లక్షల కోట్లను దానం చేసే కేఏ పాల్ కావాలా? అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదాని, అంబానీలను మిలియనీర్లను చేసిందని.. మోదీ ప్రధాని అయ్యాక వాళ్లు దేశాన్ని అమ్మేశారని ఆరోపణలు గుప్పించారు. అలాగే.. తన లైవ్ కవరేజీలు ఇవ్వకపోవడంపై మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను శపిస్తే.. మీడియా ఓనర్ల కుటుంబాలు నాశనం అయిపోతాయని హెచ్చరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 22 , 2024 | 06:05 PM