ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న దస్తగిరి..

ABN, Publish Date - Mar 10 , 2024 | 10:28 PM

దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దస్తగిరి(Dastagiri).. ఎంపీ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్‌గా మారిన తనపై తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ..

Dastagiri

కడప, మార్చి 10: దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దస్తగిరి(Dastagiri).. ఎంపీ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్‌గా మారిన తనపై తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ వేధిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు దస్తగిరి. కడప జైల్లో ఉండగా తనకు డబ్బు ఆశ చూపి తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తీసుకువచ్చారని కోర్టుకు విన్నవించాడు. దస్తగిరి తరుఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తన కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ వైఎస్ అవినాష్ రెడ్డి, అతని అనుచరులపై దస్తగిరి సంచలన ఆరోపణ చేశాడు.

వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాట వినని కారణంగా తన తండ్రిపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని పిటిషన్‌లో పేర్కొన్నాడు దస్తగిరి. ఇదే విషయాన్ని పేర్కొంటూ పులివెందుల పోలీస్ స్టేషన్‌లోనూ దస్తగిరి కంప్లైంట్ చేశాడు. అయితే, రిపోర్టుపై ఎటువంటి విచారణ లేకుండా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండానే.. సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని దస్తగిరి తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయకుండా విచారణ ఎలా చేపట్టారని దస్తగిరి ప్రశ్నించాడు.

తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ కండిషన్స్‌ను అవినాష్ రెడ్డి అతిక్రమించాడని, ఆయన బెయిల్‌ను మంజూరు చేయాలంటూ పిటిషన్‌లో కోరాడు. సాక్షినైన తనని బెదిరించిన కారణంగా తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ నిబంధనలు పూర్తిగా అతిక్రమించిన అవినాష్ రెడ్డిని తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలంటూ దస్తగిరి తన పిటిషన్‌లో కోరాడు. అవినాష్ రెడ్డి బయట ఉంటే విచారణ సరిగా కొనసాగదంటూ భయాందోళన వ్యక్తం చేశాడు. ఈ కేసులో పూర్తి న్యాయం జరగాలంటే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తక్షణం రద్దు చేయాలని న్యాయస్థానాన్ని దస్తగిరి కోరాడు. కాగా, తన పిటిషన్‌లో ప్రతివాదులుగా సిబిఐ, ఆంధ్రప్రదేశ్ హోం శాఖను కూడా చూపించాడు దస్తగిరి. అలాగే, తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాల్సిందిగా సిబిఐ కోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరొక వ్యాజ్యం కూడా దాఖలు చేయనున్నాడు దస్తగిరి. ఈ పిటిషన్‌ను మార్చి 12న విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాది తెలిపారు. అదే రోజున వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులు సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 10 , 2024 | 10:29 PM

Advertising
Advertising