YSRCP: సోషల్ మీడియా సైకోలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
ABN, Publish Date - Nov 12 , 2024 | 10:22 AM
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు.. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇరువురిపై పులివెందుల పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డిలపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.
కడప: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, (YSRCP Chief) మాజీ సీఎం జగన్ రెడ్డి (Ex CM Jagan) సొంతగడ్డ పులి వెందుల్లో పోలీసులు (Police) సోషల్ మీడియా సైకోల (Social Media Psychos) తీగలాగుతున్నారు... వరుస కేసులు నమోదవుతున్నాయి. ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు.. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇరువురిపై పులివెందుల పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డిలపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత వ్యక్తి ఫిర్యా దు మేరకు వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి.
కాగా వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. దీంతో మంగళవారం విచారణకు రానుంది. సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమంలో గుడివాడ ముబారక్ సెంటర్‌కు చెందిన వైసీపీ కార్యకర్త మహ్మద్ ఖాజాబాబా అభ్యంతరకర పోస్టులు పెట్టారని పోలీసులకు గుడివాడ బాపూజీనగర్‌కు చెందిన శ్రీరాం కనకాంబరం ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే ఖాజాబాబాను పోలీసులు అరెస్ట్ చేశారు.
సజ్జల భార్గవ్ రెడ్డి ఆదేశాలతో ఆ పోస్టులు పెట్టానని విచారణలో ఖాజాబాబా వెల్లడించారు. ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్ట్‌లో సైతం చేర్చి భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వినోద్ తదితరులను ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. జూలై 1వ తేదీ తర్వాత బీఎన్ఎస్ యాక్ట్ అమల్లోకి వచ్చిందని.. జూలైకు ముందు పెట్టిన ఈ కేసులో బీఎన్ఎస్ యాక్ట్ చెల్లదని భార్గవ్ రెడ్డి వ్యాజ్యం వేశాడు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో భార్గవ్ రెడ్డి పిటిషన్ వేశాడు.
మరోవైపు వైఎస్సార్‌సీపీ (YSRCP) సోషల్ మీడియా యాక్టివిస్ట్ (Social Media Activist) వర్రా రవీంద్ర రెడ్డిని (Varra Ravindra Reddy) పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటలకు కడప రెండో అదనపు మెజి స్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్‌రెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్ (14 days Remand) విధించారు. అలాగే ఈ కేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్, సుబ్బారెడ్డిలకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని న్యాయమూర్తి పోలీసులకు తెలిపారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన పేపర్లను వర్రా రవీంద్రరెడ్డి తరపు లాయర్లు మెజిస్ట్రేట్ ముందుంచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు న్యాయమూర్తి వర్రాకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రవీంద్ర రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
కాగా సోషల్ మీడియాలో అత్యంత హేయమైన భాషను ఉపయోగించి పోస్టులు చేసిన ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు, జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రా రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. పులివెందుల నియోజకవర్గం వేముల మండలానికి చెందిన ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, పీసీసీ చీఫ్ షర్మిల సహా కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టిన పాపం ఇప్పుడు వర్రాను వెంటాడుతోంది. ఇటీవల కడప చిన్నచౌక్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లినప్పుడు ఎంపీ అవినాశ్‌రెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పించారు. దీంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌తో పాటు చిన్నచౌక్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో తేజోమూర్తిపై వేటు పడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి: హరీష్‌రావు
పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
ఏఐసిసి అంతర్గత సమావేశంలో పాల్గొనున్న సీఎం రేవంత్
వర్రా రవీంద్ర రెడ్డికి 14 రోజుల రిమాండ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 12 , 2024 | 10:22 AM