AP Pension: ప్రొద్దుటూరులో ఫించన్ డబ్బుల మిస్సింగ్‌లో అసలు నిజం ఇదీ!
ABN, Publish Date - Jul 02 , 2024 | 11:08 AM
Andhrapradesh: పింఛన్ల పంపిణీతో నిన్న(జూలై 1) రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొనగా.. ప్రొద్దుటూరులో మాత్రం పెన్షన్ డబ్బులు మాయం అవడం తీవ్ర కలకలాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే పింఛన్ డబ్బులు మాయంపై అసలు గుట్టును బయటపెట్టారు పోలీసులు. పెన్షన్ డబ్బులను ఎవరో దోచుకెళ్ళారంటూ సచివాలయం ఉద్యోగి చెప్పడం అంతా డ్రామానే అని ఖాకీలు తేల్చేశారు.
కడప, జూలై 2: పింఛన్ల (AP Pension) పంపిణీతో నిన్న(జూలై 1) రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొనగా.. ప్రొద్దుటూరులో మాత్రం పెన్షన్ డబ్బులు మాయం అవడం తీవ్ర కలకలాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే పింఛన్ డబ్బులు మాయంపై అసలు గుట్టును బయటపెట్టారు పోలీసులు. పెన్షన్ డబ్బులను ఎవరో దోచుకెళ్ళారంటూ సచివాలయం ఉద్యోగి చెప్పడం అంతా డ్రామానే అని ఖాకీలు తేల్చేశారు. పింఛనర్లకు పంపిణి చేయాల్సిన రూ.4 లక్షల డబ్బులను సచివాలయ ఉద్యోగి మురళిమోహన్ ఆన్‌లైన్ గేమ్‌లో పోగొట్టుకుని డ్రామా క్రియేట్ చేసినట్లు అసలు విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. అలాగే ఇంత తంతంగం నడిపిన సదరు ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Parliament: పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం ప్రారంభం
అసలేం జరిగిందంటే..
జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం ఏడవ సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు మాయం అయ్యాయంటూ సచివాలయ కార్యదర్శి మురళీమోహన్ పోలీసులకు తెలిపారు. ఫించన్ డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారన్నారు. పింఛన్ పంపిణీ చేసేందుకు వెళ్తుండగా సృహ తప్పి కింద పడిపోయానని.. ఈ క్రమంలో తన వద్ద ఉన్న నాలుగు లక్షల రూపాయల పెన్షన్ డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనను 108 వాహనంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారని అన్నారు. అయితే మురళీమోహన్ చెప్పిన కారణాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. చివరకు తమదైన శైలిలో విచారణ జరుపగా సచివాలయ ఉద్యోగి చేసిన బాగోతం అంతా బయటపడింది.
ఇవి కూడా చదవండి....
AP Pensions: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. రూ. 200 కోత
AP News: స్కూల్ బస్సును ఢీకొన్న లారీ... మాజీ ఎమ్మెల్యేపై ప్రజల ఆగ్రహం
Read Latest AP News AND Telugu News
Updated Date - Jul 02 , 2024 | 11:32 AM