TDP: ఆ బిల్లకు మేం వ్యతిరేకం.. టీడీపీ నేత సంచలన ప్రకటన.. మోదీ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందా
ABN, Publish Date - Nov 03 , 2024 | 05:36 PM
తాము ఎన్డీయేలోనే ఉంటామని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో ఎన్నోసార్లు స్పష్టంచేశారు. జేడీయూ నేత నితీష్ కుమార్ సైతం తాము ఎన్డీయేలోనే ఉంటామని తేల్చేశారు. దీంతో మోదీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అంతా భావించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండగా, ఏపీ ప్రభుత్వంలో బీజేపీ..
ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. టీడీపీ మద్దతు ఉపసంహరించుకుంటే మోదీ ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం లేకపోలేదు. కానీ ఇప్పటికిప్పుడు టీడీపీ ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకునే అవకాశాలు కనిపించడం లేదు. తాము ఎన్డీయేలోనే ఉంటామని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో ఎన్నోసార్లు స్పష్టంచేశారు. జేడీయూ నేత నితీష్ కుమార్ సైతం తాము ఎన్డీయేలోనే ఉంటామని తేల్చేశారు. దీంతో మోదీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అంతా భావించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండగా, ఏపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఇప్పటికిప్పుడు చెడే అవకాశాలు తక్కువనే చెప్పుకోవాలి. కానీ కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత నవాబ్ జాన్ అమీర్ బాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.
Hemant Soren: మేము గెలిస్తే నెలకు 7 కేజీల రేషన్, పింఛన్ పెంచుతాం
వక్ఫ్ సవరణ బిల్లుపై..
టీడీపీ ఎన్డీయేలో ఉండటంతో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులకు మద్దతు తెలిపాల్సి ఉంటుంది. కానీ తాజాగా కేంద్రం తీసుకురానున్న వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, సీఎం చంద్రబాబు సైతం దీనికి మద్దతు తెలపడం లేదని నవాబ్ జాన్ వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ బిల్లును తీసుకురావడానికి అనుమతించబోమని టీడీపీ నేత నవాబ్ జాన్ అమీర్ బాబు తెలిపారు. చంద్రబాబు నాయుడు సెక్యులర్ మైండ్ ఉన్న వ్యక్తి అని, ఆయన హిందువులను, ముస్లింలను ఒకే కోణంలో చూస్తారన్నారు. వక్ఫ్ బోర్డు ఏ మతానికి చెందినదైతే అందులో ఆ మతానికి చెందిన వారు ఉండాలని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో టీడీపీ నేత నవాబ్ జాన్ అలియాస్ అమీర్ బాబు మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. బోర్డు ఏ మతానికి సంబంధించినదో ఆ మతం వారే అందులో ఉండాల్సిందేనని చంద్రబాబు నాయుడు అన్నారని తెలిపారు. డిసెంబరు 15వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో జరిగే జమియత్ సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలిపారు. నవాబ్ జాన్ ప్రకటన ప్రస్తుతం కలకం రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఆసక్తిగా మారింది. ఈ బిల్లును బీజేపీ ప్రవేశపెడితే టీడీపీ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది.
Kerala: రైల్వే ట్రాక్‌పై విషాదం.. నలుగురు మృతి
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందన
వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటన చేసింది. వక్ఫ్ సవరణ బిల్లు చాలా ప్రమాదకరమని ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. వక్ఫ్ చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ కొత్త బిల్లు చట్టంగా మారితే మసీదులు, శ్మశానాలు, మదర్సాలు అన్నీ ప్రమాదంలో పడతాయన్నారు.
ఈ ఏడాది లోక్‌సభలో..
పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బిల్లు 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సహా పలు విపక్షాలు దీనిని వ్యతిరేకించాయి. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు కోసం ప్రభుత్వం జగదాంబిక పాల్ నేతృత్వంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటు చేసింది. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది జెపిసిలో ఉన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీకి ఇప్పటివరకు ఈమెయిల్ ద్వారా 90 లక్షలకు పైగా సూచనలు అందాయి. రాత పూర్వకంగానూ పలువురు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024పై ప్రజా సంప్రదింపుల కోసం కమిటీ పలు రాష్ట్రాల్లో పర్యటించనుంది. నవంబర్ 9న అస్సాం, నవంబర్ 11న ఒడిశాలో పర్యటించనుంది. అనంతరం కోల్‌కతా, పాట్నా, లక్నోలో ఈ బృందం పర్యటించనుంది.
Delhi Air Pollution: 500 మార్క్ దాటిన ఢిల్లీ వాయు కాలుష్యం.. స్థానికుల భయాందోళన
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Nov 03 , 2024 | 05:47 PM